Prabhas Project K Sankranthi ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా ఈపాటికే విడుదలైపోయి వుండాలి.
సంక్రాంతి రేసులో ‘ఆదిపురుష్’ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.. కానీ, చివరి నిమిషంలో సినిమా వెనక్కి తగ్గింది.! ఇది 2023 సంక్రాంతి వ్యవహారం.!
ఇప్పడిక మరో సంక్రాంతిని ప్రభాస్ సినిమా కోసం ‘లాక్’ చేసి పడేశారు. 2024 సంక్రాంతికి ప్రభాస్ సినిమా ‘ప్రాజెక్ట్-కె’ విడుదల కాబోతోందిట.
‘ఆదిపురుష్’ అనుభవాల సంగతేంటి.?
ప్రభాస్ అభిమానులు.. సంక్రాంతికి తమ అభిమాన హీరో సినిమా వస్తే.. వసూళ్ళ జాతరేనని నమ్ముతున్నారు. కానీ, ఆ అభిమానుల ఆశలు అడియాసలవుతున్నాయి.
‘ఆదిపురుష్’ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. ప్రభాస్, కృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా ఇది.
అయితే, తొలుత రిలీజ్ అయిన ప్రోమో నిరాశపరిచింది. దాంతో, మరిన్ని మెరుగులు దిద్దక తప్పలేదు. ఈ క్రమంలోనే సినిమా ఆలస్యమయ్యిందన్నది ఓ వాదన.
Prabhas Project K Sankranthi.. ‘ప్రాజెక్ట్-కె’ని ఎంతవరకు నమ్మొచ్చు.?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ – దీపికా పడుకొనే జంటగా తెరకెక్కుతోంది ‘ప్రాజెక్ట్-కె’. వాస్తవానికి, ‘ఆదిపురుష్’ స్టేటస్ ఏంటన్నదానిపై అనుమానాలు ఎలా వున్నాయో.. ‘ప్రాజెక్ట్-కె’ విషయంలోనూ అదే కన్‌ఫ్యూజన్.
Also Read: SSMB28: మహేష్‌తో రాజమౌళి రికార్డుల్ని టచ్ చేస్తారట.!
డేట్ అయితే లాక్ అయిపోయింది. 12 జనవరి 2024న ఈ సినిమా విడుదల కాబోతోందని ప్రకటించేశారు.
వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి రావాల్సి వుంది. అన్నీ పెద్ద సినిమాలే.! మరి, ప్రభాస్ రాకతో ఎవరు వెనక్కి తగ్గుతారు.? ఎవరి కోసం ప్రభాస్ వెనక్కి తగ్గాల్సి వస్తుంది.? వేచి చూడాల్సిందే.