Pragya Jaiswal Liquor Promotion.. ‘అఖండ’ సినిమాలో కల్లు ఎలా తాగాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, హీరో నందమూరి బాలకృష్ణకి నేర్పిస్తుంది.
ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చాలా సార్లు చూసేశాం. హీరోయిన్ ఫుల్లుగా లిక్కర్ ఎక్కించేసి, ఆ తర్వాత తెరపై వీరంగమాడేయడం ఎన్ని సినిమాల్లో చూడలేదు.?
కానీ, సోషల్ మీడియా వేదికగా లిక్కర్ బాటిల్‌తో వున్న ఓ ఫొటోని పోస్ట్ చేస్తే.. అదో పెద్ద నేరమైపోయింది ప్రగ్యా జైస్వాల్ విషయంలో.
గతంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన భర్తతో కలిసి ఇలాగే లిక్కర్ బ్రాండ్ ఒకదాన్ని ప్రమోట్ చేసింది. చాలామంది హీరోయిన్లు ఇలాంటివి చేశారు, చేస్తున్నారు కూడా.
‘పెద్దలకు మాత్రమే..’ అని కూడా అందులో పేర్కొంటున్న దరిమిలా, దీన్నసలు తప్పు పట్టడానికే వీల్లేదు.
కానీ, మద్యపానం ఆరోగ్యానికి హాని కరం కదా.? ఆ లెక్కన సెలబ్రిటీలు లిక్కర్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ.
Pragya Jaiswal Liquor Promotion.. సెలబ్రిటీలు చెబితే.. మద్యానికి బానిసలైపోతారా.?
సెలబ్రిటీలు చెప్పారు కదా.. అని, జనాలు తప్ప తాగేసి చిందులేస్తారనడం కూడా కరెక్టు కాదేమో.

అయినాగానీ, సామాజిక బాధ్యతగా ఇలాంటి ప్రకటనల విషయంలో సెలబ్రిటీలు కాస్తంత దూరం జరిగితే మాత్రం అలాంటివారిని అభినందించాల్సిందే.
గ్లామరుండగానే అవకాశాలు దక్కించుకోవాలి.. ఆ అవకాశం ఎలాంటిదైనా కావొచ్చుగాక. లిక్కర్ బ్రాండ్లేం ఖర్మ.. దేన్నియినా ప్రమోట్ చేసుకోవచ్చు.. చేస్తున్నారు కూడా.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
‘అఖండ’తో హిట్టు కొట్టినా హీరోయిన్‌గా సరైన అవకాశాలు రావడంలేదు గనుక, వచ్చిన అవకాశాన్ని ఇలా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) సద్వినియోగం చేసుకుందని సరిపెట్టుకోవాల్సిందే.
ఇక, ట్రోలింగ్ అంటారా.? అదో టైపు పబ్లిసిటీ అయిపోయింది సెలబ్రిటీలకు.