Prakash Raj Vikram Lander సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన స్థాయిని మరింత దిగజార్చేసుకున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ వుండి వుంటే, రాజకీయ విమర్శలు చేయడాన్ని తప్పు పట్టలేం.! రాజకీయాల్లో లేకపోయినా, రాజకీయ విమర్శలు చేయడమూ తప్పు పట్టాల్సిన విషయం కాదు.
అయినాగానీ, విమర్శలకూ ఓ హద్దు వుంటుంది. ఆ హద్దులన్నీ ప్రకాష్ రాజ్ ఏనాడో దాటేశారు. ఇస్రో లాంటి సంస్థ మీద వెటకారాలేంటి.? మతిగానీ చెడిందా ఏంటి.?
Prakash Raj Vikram Lander.. విక్రమ్ ల్యాండర్‌పై వెటకారమెందుకు.?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’, చందమామ మీదకి ‘రోవర్’ని పంపింది. అందులో విక్రమ్ ల్యాండర్ అత్యంత కీలకమైనది.
ఆ విక్రమ్ ల్యాండర్ హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఓ ‘పనికి మాలిన ట్వీట్’ వేశాడు ప్రకాష్ రాజ్.
పైగా, దానికి ‘జస్ట్ ఆస్కింగ్’ హ్యాష్ ట్యాగ్ కూడా ప్రకాష్ రాజ్ జత చేశాడు. చంద్రుడి మీదకు వెళ్ళాక విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటో.. అంటూ ఓ ఫొటోని పోస్ట్ చేశాడాయన.

ఇదొక కార్టూన్ లాంటిది.! కనిపిస్తోంది కదా.? ఎంత వెటకారంగా వుందో. ఓ వ్యక్తి, చాయ్‌ని గాల్లో ఎగరేస్తూ వున్నాడు.. కప్‌లో వేయడానికి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వెటకారం చేయడానికే, ప్రకాష్ రాజ్ ఈ పోస్ట్ చేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే.
విక్రమ్ ల్యాండర్ మీద ఏడుపెందుకు.?
ఒకవేళ ప్రకాష్ రాజ్, ప్రధాన మంత్రినే టార్గెట్ చేసుకుని, సెటైర్లు వేయాలనుకుంటే.. అది ఆయనిష్టం.
కానీ, ఇందులోకి ‘విక్రమ్ ల్యాండర్’ని ఎందుకు లాగినట్టు.? ఇదే బాధ్యతారాహిత్యం.! దీన్నే దిగజారుడుతనం అని కూడా అనాలి.!
140 కోట్ల మంది భారతీయులే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది, ‘విక్రమ్ ల్యాండర్’ గురించి.
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి రోవర్‌ని పంపించాం. గతంలోనూ ఈ తరహా ప్రయోగాన్నే చేపట్టినా, అది ల్యాండ్ అయ్యే సమయంలో ఫెయిలయ్యింది.
Also Read: ‘యోగి’ కాళ్ళు మొక్కిన రజనీకాంత్.! నేరమూ.! ఘోరమూ.!
ఈసారి ఏ చిన్న లోపమూ జరగకూడదని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు. వారి సెంటిమెంట్లను హర్ట్ చేసేలా, విక్రమ్ ల్యాండర్ మీద ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం క్షమార్మం కాదు.
నిజానికి, ఇది దేశద్రోహంతో సరితూగే చర్యగానే పరిగణించాలేమో.!