Preethi Asrani Killer.. ప్రీతి అంజు అస్రాని.. అలియాస్ ప్రీతి అస్రాని.! ‘మళ్ళీ రావా’ అంటూ, సుమంత్ – ఆకాంక్ష జంటగా నటించిన సినిమాతో వార్తల్లోకెక్కిందీ బ్యూటీ.
అప్పట్లో, జస్ట్ బాల నటి మాత్రమే. కానీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె నటన.. ‘మళ్ళీ రావా’ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
అలా, ప్రీతి అంజు అస్రాని (Preethi Anju Asrani).. పేరు అప్పట్లో మార్మోగిపోయింది. క్రమంగా హీరోయిన్ రోల్స్‌కి ప్రమోట్ అయ్యింది ప్రీతి అస్రాని.
Preethi Asrani Killer.. ‘కిల్లర్’ సినిమాతో..
ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ప్రీతి అస్రాని. సినిమా పేరు ‘కిల్లర్’. తెలుగుతోపాటు, తమిళంలోనూ విడుదల కానుందీ సినిమా.

సంగీత మాంత్రికుడిగా దేశవ్యాప్త, ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఎఆర్ రెహమాన్ ఈ ‘కిల్లర్’ సినిమాకి సంగీతం అందిస్తుండడం గమనార్హం.
ప్రీతి అస్రానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ‘కిల్లర్’ (Killer Movie) టీమ్ విడుదల చేసిన పోస్టర్, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
చూపుల్తోనే చంపేస్తది..
ముందే చెప్పుకున్నట్లు, ‘మళ్ళీ రావా’ సినిమాతో బాల నటిగానే మంచి మార్కులు కొట్టేసిన ప్రీతి అస్రాని, ‘కిల్లర్’ సినిమాతో నటిగా, నెక్స్‌ట్ లెవల్‌కి వెళుతుందన్నది చిత్ర యూనిట్ అభిప్రాయం.
పోస్టర్‌లో ప్రీతి అస్రాని లుక్స్.. స్క్రీన్ మీద ఆమె కాన్ఫిడెన్స్ ఎలా వుండబోతోందో చెప్పకనే చెబుతున్నాయ్. థ్రిల్లర్ సినిమాల ట్రెండ్‌లో ప్రీతి అస్రాని, ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందో ‘కిల్లర్’ సినిమాతో.
‘కిల్లర్’ ఫిమేల్ సెంట్రిక్ మూవీ. ఇందులో ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘కిల్లర్’ చిత్రానికి దర్శకత్వం కూడా ఎస్ జె సూర్యనే కావడం గమనార్హం. నటుడిగానూ పలు ప్రెస్టీజియస్
మూవీస్‌తో బిజీగా వున్న ఎస్‌జె సూర్య, చాలా అరుదుగా అభిరుచితో స్వీయ దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తుంటాడు. అలా ఈ ‘కిల్లర్’ మరో స్పెష్ మూవీ కాబోతోంది ఆయన కెరీర్‌లో.