Table of Contents
సినిమా కోసం సాంకేతిక విలువల్ని జోడించడం ఎప్పటినుంచో చూస్తున్నదే. టెక్నాలజీ ఇంతగా అందుబాటులో లేనప్పుడూ, సాంకేతిక అద్భుతాల్ని సృష్టించిన ఘనత మన ఇండియన్ సినిమాది. ఇప్పుడు ట్రెండ్ మారింది.
సాంకేతిక అంశాల చుట్టూనే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సినిమాలు రూపొందిస్తున్నారు మన గ్రేట్ మేకర్స్. ఆ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా దర్శకుడు శంకర్‌కే దక్కుతుంది. ఏ సినిమా తీసినా, అదొక సాంకేతిక అద్భుతంలా వుండాలని శంకర్ భావిస్తుంటాడు. అందుకే, ఆయన నుంచి ‘జీన్స్, ‘అపరిచితుడు’, ‘రోబో’, ‘ఐ’ వంటి అద్భుతాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో, ‘2.0’ అన్నిటికన్నా ముందు నిలిచేందుకు సిద్ధమయ్యింది.
శంకర్ సాంకేతిక విజన్
ఓ మామూలు కథని తీసుకుని, దానికి అద్భుతాన్ని జోడించడంలో శంకర్ దిట్ట. ఆయన తన సినిమాలతో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రపంచంలో ఎవరికీ దొరకనన్ని కథలు మనకి దొరుకుతాయని చెబుతుంటాడీ దర్శకుడు.
ఓ మామూలు కథకు, అత్యాధునిక సాంకేతికతను జోడిస్తే అదొక అద్భుతమవుతుందనీ, హాలీవుడ్ సినిమాలకు మన ఇండియన్ సినిమా ఏమాత్రం తక్కువ కాదని ‘2.0’ (2 point 0) ప్రమోషన్‌లో భాగంగా పలుసార్లు శంకర్ చెప్పాడు.
‘రోబో’ (Robo) తో ఘనవిజయం సాధించినా, ‘2.0’ (Enthiran 2 point 0) సినిమాతో ఘనవిజయం సాధించేందుకు సిద్ధమయినా.. అదంతా ప్రేక్షకులు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అని శంకర్ నిర్మొహమాటంగా చెప్పేశాడు. ప్రేక్షకులు ఆదరిస్తే, సినిమా సినిమాకి మరింత అద్భుతమైన సాంకేతికత కోసం ప్రయత్నిస్తూనే వుంటాననీ, ఈ జోరులో ‘2.0’కి కూడా సీక్వెల్ వస్తుందేమోనని అన్నాడు శంకర్.
వయసు అరవై.. ఆలోచనలు ఇరవై..
రజనీకాంత్ (Super Star Rajinikanth) వయసు అరవై పై మాటే. కానీ, ఆయన మనసు ఇరవైల్లో వున్నట్లే ఆలోచిస్తుంటుంది. లేకపోతే ‘రోబో’ లాంటి సినిమా ఆయన చేయలేడు. ఇప్పుడు ‘2.0’ సినిమా చేశాడంటే పరుగులెత్తే అతని ఇరవయ్యేళ్ళ మనసు కారణంగానే. ఓ దశలో శారీరక వయసు, ‘వద్దు’ అని చెప్పినా, ఇరవయ్యేళ్ళ మనసు మాత్రం ఒప్పుకోలేదట. ఇలాంటి అద్బుతాన్ని మిస్ కాకూడదనే కసితోనే ‘2.0’ సినిమా చేశానని రజనీకాంత్ పలుసార్లు వివరించారు. అదీ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే.
ఫస్ట్ టాక్ అదిరింది..
సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ అంచనాలు ఆకాశాన్నంటేలా వున్నాయి. ఫస్ట్ రిపోర్ట్స్ సూపర్ పాజిటివ్‌గా కన్పిస్తున్నాయి. అరబ్ దేశాల నుంచి తొలి రిపోర్ట్ అందుతోంది. ఆ రిపోర్ట్ ప్రకారం సినిమాకి 4 పాయింట్స్ రేటింగ్ ఇచ్చేయవచ్చునట.
విలన్ పాత్రలో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) అదరగొట్టేస్తే, రజనీకాంత్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడట. స్టయిలింగ్ పరంగా రజనీకాంత్‌ని ఇంకెవరూ దాటలేరన్నది ఫస్ట్ రిపోర్ట్స్ చెబుతున్న సారాంశం. అందాల భామ అమీ జాక్సన్ (Amy Jackson) ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ అట.
రెహమాన్ సంగీతం.. ఆశ్చర్యపరిచే నిర్మాణ విలువలు
మ్యూజిక్ మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ (AR Rehman) ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం, అత్యద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఈ తరహా సినిమాలకు రెహమాన్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్‌గా మారతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ-రికార్డింగ్ విషయంలో రెహమాన్, మరో మెట్టు పైకెక్కాడట ఈ సినిమాతో. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్.. ఇలా ఒకటేమిటి, ప్రతి ఒక్కటీ అద్భుతమేనని సినిమా ప్రోమోస్‌తోనే అందరికీ అర్థమయిపోయింది. ఫస్ట్ రిపోర్ట్స్ కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి.
10 వేలకు పైగా థియేటర్లు.. వివిధ భాషలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘2.0’ ఓ అద్భుతం.. రివ్యూ (2 point 0 Review) ఇక్కడే.. కొద్ది గంటల్లో..