Table of Contents
స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచె మనసు’తోపాటుగా, ‘కెజిఎఫ్’ (కన్నడ), ‘మారి-2’ (తమిళ్) తెలుగులోకి డబ్ అయి, డిసెంబర్ 21నే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి (KGF Maari2 Zero Preview). వీటితోపాటు, ‘జీరో’ సినిమా కూడా ఇదే రోజున విడుదలవుతోంది. అయితే, ‘జీరో’ హిందీ వెర్షన్‌ని మాత్రమే తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశముంది.
డబ్బింగ్ సినిమాలే అయినా ‘మారి-2’, ‘కెజిఎఫ్’ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ‘మారి-2’ సినిమా విషయానికొస్తే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే అయిన ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ఇది. పైగా, సాయిపల్లవి (Sai Pallavi) ఈ సినిమాలో హీరోయిన్. దాంతో, ‘మారి-2’పై తెలుగులోనూ ఇంట్రెస్ట్ బాగానే క్రియేట్ అయ్యింది. ‘కెజిఎఫ్’ సినిమా భారీ బడ్జెట్ మూవీ కావడం, తెలుగులోనూ ప్రమోషన్స్ బాగా చేయడంతో, సినిమా చూసేందుకు తెలుగు ప్రేక్షకులూ బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షారుక్ ‘జీరో’ సంగతి సరే సరి.
ఒకటీ.. రెండూ.. మూడూ.!
క్రేజ్ పరంగా చూసుకుంటే, ‘జీరో’ సినిమా పట్ల ఎక్కువమంది తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశం వుంది. దానిక్కారణం ఈ సినిమాలో హీరో షారుక్ కావడం. అనుష్క శర్మ (Anushka Sharma), కత్రినాకైఫ్ (Katrina Kaif) ఈ సినిమాలో హీరోయిన్లు కావడం ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఇంకో కారణం. వీటన్నిటితోపాటుగా, షారుక్ ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కన్పిస్తుండడం సినిమా వైపుకు ఆడియన్స్‌ని నడిపించే ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ ‘జీరో’పై ఇంట్రెస్ట్‌ని రెట్టింపు చేసేశాయ్.
కెజిఎఫ్ – గోల్డెన్ ఛాన్స్..
రెండో ప్లేస్ ఖచ్చితంగా ‘కెజిఎఫ్’ సినిమాదే. ఎందుకంటే, ఈ సినిమాకి తెలుగులో ఆ స్థాయిలో పబ్లిసిటీ చేశారు. కన్నడ నటుడు యశ్ (Namma Yash) హీరోగా నటించిన సినిమా ఇది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) నేపథ్యంలో సాగే సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. భారీ బడ్జెట్‌తో ఈ ‘కెజిఎఫ్’ని రూపొందించారు. మాస్ మెచ్చే అన్ని అంశాలూ ఈ సినిమాలో వున్నాయని ప్రోమోస్‌ని చూస్తే అర్థమవుతుంది.
‘మారి-2’ని ఎలా మర్చిపోగలం.?
డిసెంబర్ 21న రిలీజయ్యే సినిమాల్లో (KGF Maari2 Zero Preview) ‘మారి-2’ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో ధనుష్‌తోపాటు, సాయిపల్లవి కూడా వుంది. డాన్సుల్లో ధనుష్ సూపర్. సాయి పల్లవి సూపరో సూపర్. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వుంటుందట.. ఆ విషయం సినిమా చూస్తేనే తెలుస్తుందట. అయితే, ఆల్రెడీ ప్రోమోస్‌లో ధనుష్ – సాయిపల్లవి కెమిస్ట్రీ గురించి చూసేశాం.
మాస్.. ఊర మాస్.. అనే స్థాయిలో ఇటు ధనుష్, అటు సాయిపల్లవి రెచ్చిపోయి డాన్సులేస్తోంటే.. థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ ఖాయమనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ‘మారి-2’ సినిమాకి కోలీవుడ్‌లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తొలి రోజు ధనుష్ సినిమాల పరంగా చూస్తే రికార్డు స్థాయి వసూళ్ళు వస్తాయని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కన్నడ వెర్షన్ ‘కెజిఎఫ్’ అయితే, ప్రి రిలీజ్ అంచనాలు ఆకాశాన్నంటేసేలా వున్నాయ్. ఫస్ట్ డే వసూళ్ళను యష్, ‘కెజిఎఫ్’తో కొల్లగొట్టేస్తాడని ఆల్రెడీ ట్రేడ్ పండితులు ఓ అంచనాకి వచ్చేశారు. కన్నడతోపాటు, తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ‘కెజిఎఫ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మూడూ (KGF Maari2 Zero Preview).. రేసులో సత్తా చాటేవేనా.?
హిందీ సినిమా ఒకటి, కన్నడ సినిమా ఒకటి, తమిళ సినిమా ఒకటి (KGF Maari2 Zero Preview), రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు వెరసి, తెలుగు సినీ అభిమానుల ముందుకు మొత్తంగా ఐదు సినిమాలు వచ్చేస్తున్నాయ్. క్రిస్‌మస్ సీజన్‌లో.. ఈ ఐదు సినిమాలూ ప్రేక్షకుల మన్ననల్ని అందకుంటాయా.? అందుకోవాలనే ఆశిద్దాం.