Priya Bhavani Shankar.. హీరోయిన్లు.. కాంట్రవర్సీలు.. రెండిటినీ విడదీసి చూడలేం. నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఎవరూ వివాదాలకు అతీతం కాదు.!
వాళ్ళేదో చెబుతారు.. వీళ్ళకేదో అర్థమవుతుంది.. ఇంకోటేదో రచ్చ జరుగుతుంటుంది.! సినీ ప్రపంచంలో ఇవన్నీ మామూలే.
అడ్డగోలు రాతలు ఒక్కోసారి సినీ జనాలకు విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంటాయి. ఫ్రీ పబ్లిసిటీ కదా, చాలా సార్లు వాటిని ఎంజాయ్ చేస్తుంటారు సెలబ్రిటీలు.
డబ్బెవరికి చేదు.?
నటి ప్రియా భవానీ శంకర్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. ‘డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నా..’ అని ఆమె చెప్పిందట ఏదో ఇంటర్వ్యూలో.!

చెప్పిందో లేదో తెలీదు.! కానీ, అందులో తప్పేముంది.? సినిమా అనేది కూడా ఓ ప్రొఫెషన్. సో, డబ్బు కోసం సినిమాల్లో నటిస్తే.. అందులో తప్పు పట్టడానికి ఏముంటుంది.?
లక్షలు.. కోట్లు.. రాత్రికి రాత్రి స్టార్‌డమ్.. ఇవన్నీ సినీ పరిశ్రమలోనే సాధ్యమవుతాయ్. డబ్బు కోసం కాకుండా, సమాజ సేవ కోసం సినిమాల్లోకి ఎవరైనా వస్తారా.?
Priya Bhavani Shankar.. ఔను.. నిజమే..
‘నేనైతే అలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు.. అదే సమయంలో, ఒకవేళ అలా అన్నాగానీ.. అది తప్పు కాదు..’ అంటూ ప్రియా భవానీ శంకర్ తాజాగా పేర్కొంది తన మీద వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.
Also Read: Ketika Sharma: నల్లా నల్లాని సోకు.! అట్టాగ సూడమాకే.!
‘కళ్యాణం కమనీయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఈ సంక్రాంతికి పలకరించింది ప్రియా భవానీ శంకర్. ఇంతలోనే, ఈ కాంట్రవర్సీ.!