Priyanka Jawalkar Love Story: క్రికెట్‌కీ, సినిమాకీ అవినాభావ సంబంధం వుంది. క్రికెటర్లు సినిమాల్లోకొస్తున్నారు.. సినీ నటుల్లో కొందరు క్రికెట్ మీద ఆసక్తి కలిగినవారూ వున్నారు.
క్రికెటర్లను అందాల భామలు పెళ్ళాడటం కొత్తేమీ కాదు. అదే సమయంలో, అలాంటి కొన్ని ప్రేమలు ‘రిటైర్డ్ హర్ట్’ అవడమూ మనకి తెలుసు. కొన్నయితే గోల్డెన్ డక్ కూడా అయిపోతుంటాయ్.!
Priyanka Jawalkar Love Story ప్రియాంక జవాల్కర్ కిరికెట్టు.!
ఇంతకీ, ఇప్పుడీ సినీ క్రికెట్ గోలేంటి.? ఈ కిరికెట్టు తాలూకు కనికట్టు సంగతేంటి.? అంటే, మన తెలుగు భామ ప్రియాంక జవాల్కర్, ఓ క్రికెటర్‌తో ప్రేమాయణంలో పడిందన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ గాసిప్.
వెబ్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఈ విషయమై రచ్చ రచ్చ చేసేస్తున్నాయ్.
ఆ క్రికెటర్ ఎవరో కాదు వెంకటేష్ అయ్యర్. ఆయన్ని ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) ఫాలో అవుతోంది.
ప్రియాంకని వెంకటేష్ అయ్యర్ పాలో అవుతున్నాడు సోషల్ మీడియాలో. ప్రియాంక పెట్టిన ఓ ఫొటో పట్ల వెంకటేష్ స్పందిస్తే, ‘ఎవరు నువ్వు’ అంటూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసింది.!
కదిపితే బోల్డన్ని సినీ క్రికెట్ ప్రేమకథలు బయటపడ్తాయ్.!
అంతే, ఈ వ్యవహారం చుట్టూ బోల్డన్ని ఊహాగానాలు షురూ అయ్యాయ్. ఇంకేముంది.. ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారనీ, ఆల్రెడీ డేటింగులు షురూ చేశారనీ.. బోల్డన్ని కథనాలు వేడి వేడిగా వడ్డించబడుతున్నాయ్.

కొన్నాళ్ళ క్రితం మలయాళీ బ్యూటీ అనుపరమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేరుని క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాతో ముడిపెట్టి గాసిప్స్ సర్క్యులేట్ చేశారు కొందరు. కానీ, బుమ్రా.. వేరే అమ్మాయిని పెళ్ళాడేశాడు. ఆ సమయంలో అనుపమ వైరాగ్యానికి గురయ్యిందంటూ కథనాలొచ్చాయ్.!
Also Read: Sonam Kapoor.. అలా చెప్తేనే ‘కిక్కు’ వస్తుందట.!
ఇంతకీ, ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) ఈ గాసిప్స్‌పై స్పందిస్తుందా.? వేచి చూడాల్సిందే. అన్నట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్కని పెళ్ళాడిన సంగతి తెల్సిందే.
అజారుద్దీన్, తన మొదటి భార్యకు విడాకులిచ్చి.. సినీ నటి సంగీతా బిజిలానీని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళి ఆ తర్వాత పెటాకులయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.