Protect Environment Protect Yourself.. ప్రకృతి నుంచి అన్నీ మనం లాగేసుకుంటున్నాం. కానీ, ఆ ప్రకృతికి మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిఖార్సయిన సత్యం.
సినీ సెలబ్రిటీలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో హంగామా చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. రాజకీయ నాయకుల సంగతి సరే సరి.
కోట్లాది మొక్కలు నాటేయాలంటూ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించేస్తుంటాయి. సెలబ్రిటీలు తాము మొక్కలు నాటుతున్న వైనాన్ని సోషల్ మీడియాలో పెట్టి పబ్లిసిటీ పొందుతుంటారు.
ఏదీ ఎక్కడ.? ఆ చైతన్యం తాలూకు ఫలితాలేవీ.? అది మాత్రం అడక్కూడదు. ఎందుకంటే, జరుగుతున్నవన్నీ పబ్లిసిటీ స్టంట్లే గనుక.
సినిమా షూటింగ్ కోసం పచ్చని పంట పొలాల్ని ధ్వంసం చేసిన (Destruction Of Nature) వైనం ఎన్నోసార్లు మీడియాలో చూశాం.
రాజకీయ నాయకులు తమ బహిరంగ సభల కోసం పచ్చని పొలాల్ని చదును చేయడం గురించి వింటూనే వున్నాం. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నవే.
కాంక్రీట్ జంగిల్.! మనిషి మారడంతే.!
ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకెలా మనం పర్యావరణాన్ని కాపాడగలం.?
రోడ్ల మీద వాహనాలు పెరిగిపోతున్నాయి.. ఎక్కడికక్కడ పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి.. (Air Pollution and Water Pollution) మరి, చెట్లు కూడా ఆ స్థాయిలో పెరగాలి కదా.? కానీ, పెరగవు. అదంతే.

ప్రభుత్వాలు చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతన వుండదు. యధా రాజ.. తథా ప్రజ. అందుకే, పర్యావరణ పరిరక్షణ అనేది జస్ట్ ఓ పబ్లిసిటీ స్టంటులా మారిపోయింది.
ప్రకృతిని మనం నాశనం చేస్తోంటే.. (Distruction Of Environment) ఆ ప్రకృతి నుంచే మనకు వినాశనం పొంచి వుంటుందన్న సత్యాన్ని విస్మరిస్తున్నాం.
Protect Environment Protect Yourself.. మనిషి మారాల్సిందే.!
నీళ్ళు కొనుక్కుంటున్నాం.. ప్రాణ వాయువునీ కొనుక్కుంటున్నాం. నీళ్ళు, ప్రాణ వాయువు.. కొనుక్కోలేనంత గడ్డు పరిస్థితులు వస్తే.?
Also Read: అరరె.! ‘బాంబు’లకీ అమ్మ, నాన్న వుంటారా.?
ఇంకేం చేస్తాం, ఏదన్నా వేరే గ్రహం మీదకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసేసుకుంటున్నాం కదా.. అంతే తప్ప, మనిషి మారే ప్రపక్తే లేదు.
ఈ భూమ్మీద మనం బతకడం కోసం అయినా పర్యావరణాన్ని (Mother Nature) కాపాడుకునే ప్రయత్నం చిత్తశుద్ధితో (Protect Environment and Nature Protect Yourself) చేసేదే లేదంతే.