Table of Contents
Pulivendula ZPTC YS Jagan.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఓ నియోజకవర్గం వెరీ వెరీ స్పెషల్.! ఎందుకంటే, అక్కడ ప్రజాస్వామ్యం గురించి అస్సలు మాట్లాడకూడదు.!
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అది.! వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ.. పులివెందుల నియోజకవర్గం ‘కంచుకోట’గా చెబుతుంటారు.
ఎలా, పులివెందుల నియోజకవర్గం ‘వైఎస్’ కుటుంబానికి కంచుకోటగా మారింది.? అంటే, ఫ్యాక్షనిజం వల్లే.. అన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంటుంది.
Pulivendula ZPTC YS Jagan.. గుండె పోటు.. గొడ్డలి వేటు..
ఇదే పులివెందుల నియోజకవర్గంలోనే, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో నిజా నిజాల్ని సీబీఐ కూడా తేల్చలేకపోతోంది.
పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఇలా వుంటాయి. అదేంటీ, వైఎస్ వివేకానంద రెడ్డి కూడా వైఎస్ కుటుంబానికి చెందినవారే కదా.? అంటే, లెక్కలు మారాయ్ మరి.
తొలుత గుండె పోటు.. అని తేల్చిన వైసీపీ, ఆ తర్వాత, ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ మరో దుష్ప్రచారానికి తెరలేపింది.
చివరికి, వైఎస్ వివేకానంద రెడ్డికి ఓ ముస్లిం మహిళతో అక్రమ సంబంధం వుందనీ, ఆ కారణంగానే హత్య జరిగిందనీ తేల్చింది వైసీపీ.
పులివెందుల ఫ్యాక్షన్ స్వామ్యం..
పులివెందులలో రాజకీయం ఇలా వుంటుంది. అలాంటి పులివెందులలో ఎన్నికలు ఎలా జరుగుతాయి.? అనే విషయం అందరికీ తెలిసిందే.
కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం పులివెందులలో పెద్ద యుద్ధమే జరిగింది. ఓటుకి పది వేల రూపాయలకు పైనే ఖర్చు చేయాల్సిన దుస్థితి వైసీపీకి ఎందుకొచ్చింది.?
అంత ఖర్చు చేసి కూడా, దాడులు, ప్రతిదాడులకు తెగబడాల్సిన అవసరం వైసీపీకి వచ్చింది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది.
టీడీపీ అలా అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నించింది పులివెందులలో. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో గలాటా ఊహించిందే.
రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ రీ-పోలింగ్‌ని వైసీపీ చిత్రంగా బహిష్కరించింది కూడా.!
వాడు.. వీడు.. ఇదేం సంస్కారం.?
ఇంకోపక్క, వైసీపీ అధినేత అలానే పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్, ప్రెస్ మీట్ పెట్టారు.. ‘పోలీస్ ఉన్నతాధికారిని పట్టుకుని వాడు వీడు..’ అంటూ విరుచుకుపడిపోయారు.
టీడీపీ నేత బీటెక్ రవిని ఉద్దేశించి కూడా ‘వాడు వీడు’ అంటూ నోరు జారిన వైఎస్ జగన్, పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో ‘వై నాట్ కుప్పం’ అంటూ, వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి.
రాజకీయ ప్రత్యర్థులు అసలంటూ నామినేషన్లే వేయకూడదని.. అరాచకం సృష్టించింది అప్పటి అధికార పక్షం వైసీపీ. అలాంటి వైసీపీ, ఇప్పుడు ‘ప్రజాస్వామ్యానికి పాతర’ అంటోంది.
పులివెందుల రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే, ఎప్పుడూ ‘ప్రజాస్వామ్యం’ అనే మాట వాడకూడదు.. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు అలా తగలడతాయి.
ఆ పులివెందులను కంచుకోటగా మార్చుకున్న వైఎస్ జగన్, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడితే, కంచుకోట బద్దలైపోతుందన్న అసహనంతోనే.. ఇదిగో ఇలా నోరు పారేసుకుంటున్నారన్నమాట.