‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన కొంటె కోనంగి పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam). ఆమె అసలు పేరు కన్నా, తొలి సినిమా క్యారెక్టర్ పేరు సునీతగా పక్కింటమ్మాయ్‌లా, కాదు కాదు మనింట్లో అమ్మాయిలాగే రిజిస్టర్ అయిపోయింది. హీరోయిన్ అవికాతో సమానంగా పునర్నవికి (Punarnavi Bhupalam Bigg Boss 3 Telugu) మార్కులు పడ్డాయి.
ఆ ఉయ్యాల జంపాల సినిమాలోని హీరోయిన్ ఫ్రెండు ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 3లో (Bigg Boss Season 3 Telugu) సందడి చేస్తోంది. బిగ్ హౌస్‌లో దాదాపు అందరి కంటే పునర్నవి వయసులో చిన్నది కావచ్చు. కానీ, చాలా హుందాగా వ్యవహరిస్తోంది. బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే అందరికీ షాకిచ్చింది తన గ్లామర్‌తో. ఇక హౌస్‌లో డే వన్ హాట్ అండ్ క్యూట్ గా కనిపించింది.
ఇదిలా వుంటే, వరుణ్ సందేశ్ తో ఎలిమినేషన్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం పునర్నవి (Punarnavi Bhupalam Bigg Boss 3 Telugu) చాలా షార్ప్‌గా రెస్పాండ్ అయ్యింది. నిజానికి అంత షార్ప్‌గా ఆ సీన్‌లో రెస్పాండ్ కావల్సిన అవసరం లేదు.
కానీ, హౌస్‌లో నేనూ యాక్టివ్‌గానే ఉన్నానని ఆడియన్స్‌కి చాటిచెప్పేలా ఆమె ఆటిట్యూడ్ కనిపించింది ఆ క్షణంలో. ఆ తర్వాతి నుండీ హౌస్‌లో ఎనర్జిటిక్‌గా అందరితోనూ కలిసిపోతోంది పునర్నవి.
ఇక చిన్న పిల్లల టాస్క్‌లో కేర్ టేకర్‌గా చాలా హుందాతనం ప్రదర్శించింది. చీరకట్టులో పెద్దరికం ప్రదర్శించింది పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam Bigg Boss 3 Telugu). ఇక్కడే చాలా మార్కులు కొట్టేసింది పునర్నవి.
ఇక ఇదే టాస్క్‌లో శ్రీముఖి చేసిన అల్లరి చేష్టలకు టీచర్‌లా తనదైన శైలిలో మందలించి మరోసారి ఆ పాత్రకు అందాన్ని తెచ్చిపెట్టింది. ఇంకా ఆశక్తికరమేంటంటే, చిన్న పిల్లల టాస్క్‌కి సంబంధించి, మహేష్ విట్టా ఇష్యూలో పునర్నవి ప్రవర్తన ఆడియన్స్‌ని మరింత కట్టి పడేసింది.
ఓవర్ యాక్షన్ చేయనంటూ మహేష్ టాస్క్ నుండి తప్పుకోవడాన్ని కేర్ టేకర్‌గా బిగ్‌బాస్‌కి కంప్లైంట్ చేయొచ్చు. కానీ, మహేష్ వద్దకు వెళ్లి ఓ టీచర్‌లా ఆయన్ని మోటివేట్ చేసి మళ్లీ టాస్క్‌లోకి తీసుకొచ్చిన వైనం పునర్నవికి (Punarnavi Bhupalam Bigg Boss 3 Telugu) హౌస్‌లో ఫుల్ మార్కులు పడేలా చేసింది.
బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss 3 Telugu) అంటే ఆషా మాషీ కాదు.. ఖచ్చితమైన ప్లానింగ్ వుండాలి. చాలా కాన్ఫిడెన్స్ వుండాలి. సమయస్ఫూర్తి తప్పనిసరి.
సెన్సాఫ్ హ్యూమర్ కావొచ్చు.. అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం కావొచ్చు.. అందరితో కలివిడిగా వుంటూనే, అవసరమైనప్పుడు తమదైన వాదాన్ని గట్టిగా వినిపించడం కావొచ్చు.. ఇలా చాలా చెయ్యాల్సి వుంటుంది. అలా చేయాలంటే, మానసికంగా చాలా బలంగా వుండాలి. పునర్నవిలో ఈ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయనే చెప్పొచ్చు.
ఇలా పిట్ట కొంచెం కూత ఘనమే కాదు, ఈ పిట్ట చాలా హుందాతనం అని అనిపించుకుంటోంది పునర్నవి భూపాలం (Punarnavi Bhoopalam). ఈ బిహేవియర్ ఆమెని బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 విజేతగా నిలబెడుతుందా.? అబ్బో, దానికింకా చాలా సమయం వుంది. ఈలోగా చాలా చాలా జరిగిపోతాయ్ బిగ్ హౌస్ లో.