Pushpa The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon StAAr Allu Arjun) ‘పుష్ప’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతూనే వున్నాయ్. ఈ సినిమా నుంచి తాజాగా ‘సామి.. సామి’ అంటూ సాగే పాటకి సంబంధించి లిరికల్ వీడియోను విడుదల చేసింది ‘పుష్ప’ టీమ్.
‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మా.. మంగమ్మా..’ అంటూ సాగే పాట గుర్తుంది కదా.? ఆ పాటలో సమంత ఏ స్థాయిలో చెలరేగిపోయిందో.. అంతకు మించి.. అనే స్థాయిలో రష్మిక మండన్న ‘సామీ.. సామీ’ పాటలో చెలరేగిపోయిందనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
Pushpa The Rise.. Saami Saami అదిరింది..
డైరెక్టర్ సుకుమార్ మేకింగ్.. అలాగే అత్యద్భుతమైన విజువల్స్.. వీటికి తోడు మంచి లిరిక్స్.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఒకటేమిటి.. అన్నీ టాప్ క్లాస్‌లోనే వున్నాయి. లిరికల్ వీడియోలో కనిపించిన కొన్ని వీడియో బైట్స్, పాటపైనా, సినిమాపైనా అంచనాల్ని అమాంతం పదింతలు పెంచేశాయంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు.
సంప్రదాయ దుస్తుల్లోనూ బీభత్సమైన హాట్ అప్పీల్ రష్మిక మండన్న (Rashmika Mandanna) ఒలకబోసేయడం ఈ పాటలోని మరో ప్రత్యేకత. ఆమె గ్లామర్ కంటే ఎక్కువగా ఆమె ఎక్స్‌ప్రెషన్స్, డాన్సులు డామినేట్ చేశాయ్. అల్లు అర్జున్, రష్మికల మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో మరో హైలైట్.

ది బెస్ట్ సాంగ్.. నో డౌట్..
ఖచ్చితంగా చెప్పొచ్చు.. ఈ పాట మొత్తం ఆల్బమ్‌లోనే ది బెస్ట్ సాంగ్ అవుతుంది. అలాగని ఇప్పటికే వచ్చేసిన ‘దాక్కో మేక’ తదితర పాటలేం తక్కువ కాదుగానీ, వాటికి మించి ‘సామీ సామీ’ పాట కనిపిస్తోంది. ఓవరాల్‌గా ‘పుష్ప’ (Pushpa The Rise) మ్యూజికల్ ఆల్బమ్ బంపర్ హిట్.. అని బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు.
Also Read: అభద్రతాభావంపై రష్మికాస్త్రం.. అసలేమైంది చెప్మా.?