Pushpa The Rule Shooting.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్‌కి (Stylish Icon Star Allu Arjun) సంబంధించినంతవరకు ఇది ఆయనకు తొలి పాన్ ఇండియా సినిమా.
తొలి రోజు వచ్చిన టాక్, సినిమా సాధించిన విజయం.. ఈ రెండిటికీ అస్సలు పొంతన లేదు. అంతటి ఘనవిజయాన్ని ‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) అందుకుంది.
కానీ, ‘పుష్ప ది రూల్’ సంగతేంటి.? ఈ సినిమా చుట్టూ ఎందుకు ఇన్ని అనుమానాలు.? ‘పుష్ప ది రూల్’ నిర్మాణంలో ఆలస్యమెందుకు.? సెట్స్ మీదకు వెళ్ళడానికే మొహమాటమెందుకు పడుతోంది.?
Pushpa The Rule Shooting.. కానీ, ఎందుకు.?
బోల్డన్ని ప్రశ్నలు, వేటికీ సమాధానం దొరకని పరిస్థితి. ఎప్పుడో మార్చిలోనే ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి వుండగా, అది కాస్తా వెనక్కి వెళ్ళింది. ఎందుకు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ నాటికిగానీ, ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం లేదట.
ఇంకోపక్క, సినిమాలో హీరోయిన్ పాత్రని చంపేయబోతున్నారంటూ ప్రచారం తెరపైకొచ్చింది. ‘అబ్బే అదేం లేదు’ అంటూ చిత్ర యూనిట్ వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా, ‘పుష్ప’ (Pushp Movie) సినిమా 2023లో వచ్చే అవకాశమే లేదని, 2024లోనే సినిమా విడుదలవుతుందనీ కొత్త ప్రచారం షురూ అయ్యింది.
ఇంతేనా.? ఇంకా చాలా వున్నాయ్. రష్మిక మండన్న (Rashmika Mandanna) ప్లేస్‌లోకి ఇంకో స్టన్నింగ్ బ్యూటీని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నది మరో గాసిప్.
లేట్ అయితే.. లేటెస్ట్ రూమర్స్ తప్పవ్.!
‘పుష్ప ది రూల్’లో అనసూయ (Anasuya Bharadwaj) పాత్ర కూడా మారిపోతుందని అంటున్నారు. విలనిజం విషయంలోనూ వేరే ఆలోచనలు జరుగుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నియ.
Also Read: నజ్రియా.! అప్పుడేమో వద్దు.. ఇప్పుడేమో ముద్దు.!
సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం ఆలస్యమయ్యే కొద్దీ, ఇలాంటి పుకార్లు మరింతగా షికార్లు చేసేస్తుంటాయ్. వీటన్నిటికీ ఎండ్ కార్డు పడాలంటే.. సినిమా షూటింగ్ షురూ అవ్వాల్సిందే.
కానీ, ఎప్పుడు ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) షూటింగ్ మొదలవుతుంది.? అదైతే, ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్ అయికూర్చుంది.