Raashi Khanna Body Shaming: దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్లకు అంత చిన్న చూపు ఎందుకు.? ఓ సౌత్ హీరో తనను ‘బెడ్రూమ్’కి రమ్మన్నాడంటూ ఓ బాలీవుడ్ నటి విమర్శించింది కొన్నాళ్ళ క్రితం.
బొడ్డు మీద కొబ్బరి కాయ చిప్పలు పెట్టడంలో ఏం హాట్ అప్పీల్ వుందో తనకు అర్థం కాలేదంటూ మరో హీరోయిన్ ప్రముఖ దక్షిణాది దర్శకుడి మీద సెటైర్లేసింది. అదే నటి, ఆ తర్వాత తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు క్షమాపణ కూడా చెప్పిందనుకోండి. అది వేరే సంగతి.
సౌత్ సినిమాల నుంచి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడం, మళ్ళీ అదే సౌత్ సినిమా మీద పడి ఏడవడం అలవాటుగా మారిపోయిందేమో అందాల భామలకి.
Raashi Khanna Body Shaming.. రాశి ఖన్నా.! ఎందుకిలా.?
తాజాగా ఈ లిస్టులోకే చేరిపోయింది రాశి ఖన్నా కూడా. ఆమెను ఎవరో గ్యాస్ ట్యాంకర్ అని విమర్శించారట. మొదట్లో కాస్త బొద్దుగా వుండేది రాశి ఖన్నా. దాంతో, ఆమెను ఎవరన్నా అలా అన్నారో ఏమో.! లేదంటే, తనంతట తానే అలా ఊహించేసుకుందో.
ఔను మరి, నిజానికి సౌత్ సినీ అభిమానులు బక్కచిక్కిపోయిన భామలకంటే కూడా కాస్త బొద్దుగా వున్న అందాల భామల్నే ఇష్టపడుతుంటారు. సో, రాశి ఖన్నాని ‘గ్యాస్ ట్యాంకర్’ అని సౌత్‌లో విమర్శించడానికి ఆస్కారం తక్కువే.

అలాంటి విమర్శలకు తానెప్పుడూ భయపడలేదంటూనే, సినిమా కోసం సన్నబడ్డాననీ, కెరీర్‌లో ముందుకు దూసుకెళ్ళాననీ రాశి ఖన్నా (Raashi Khanna) తాజాగా చెప్పుకొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మీదనే సెటైర్లు పడుతుంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సెటైర్లను ఎదుర్కొన్నవాడే. రజనీకాంత్ రంగు మీద వచ్చే కామెంట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Also Read: ఏ‘కాంత’ సేవకు పిలిచిన ఆ హీరో ఎవరబ్బా.?
అంతెందుకు, సౌత్‌లో కొందరు హీరోల ‘హైట్’ మీద కూడా సెటైర్లు వేసేస్తుంటారు. సినిమా అంటేనే అంత.
సినిమా సెలబ్రిటీల మీద సెటైర్లేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అలాంటి సెటైర్లను సెలబ్రిటీలు పట్టించుకున్న సందర్భాలు చాలా చాలా అరుదు.
మీ టూ పేరుతోనో, ఇంకో పేరుతోనో సౌత్ సినిమాని టార్గెట్ చేయడం కొందరికి అలవాటుగా మారిపోయిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
అదేంటో, బాలీవుడ్‌లో ఎన్ని అకృత్యాలు జరిగినా, అక్కడి పరిస్థితులపై పెదవి విప్పేవారు చాలా అరుదుగా వుంటారు.