Raashi Khanna.. ఆ అమ్మాయి ‘కత్తి’లా వుందిరా..’ అని ఎవరైనా కామెంట్ చేస్తే, ‘బుద్ధుందా లేదా.. అమ్మాయిల్నిఅలాగేనా వేధించేది.?’ అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి అదే ‘కత్తి’ని అందాల భామ రాశిఖన్నా ట్విట్టర్‌లో వాడితే కుర్రాళ్లు ఏమైపోవాలి.?
సంక్రాంతి పండక్కి అబ్బాయిల గుండెల్నికోసి పాడేసింది రాశీఖన్నా తన ట్వీట్ ద్వారా రాశీ ఖన్నా. Did My Back Hurt your Knife.. అంటూ ట్వీటేసింది రాశీ ఖన్నా. దాంతో పాటు ఓ ఫోటోనీ జత చేసింది. అనాచ్ఛాదిత వీపు భాగాన్ని చూపిస్తూ వుంది రాశీ ఖన్నా ఆ ఫోటోలో. చాలా అమాయకంగా చాలా ఘాటుగా.
Raashi Khanna.. మంట పెట్టేసిందహో..
ఇంకేముంది.. రాశీ ఖన్నా ట్వీట్ గురించి రీసెర్చులు మొదలెట్టేశారు నెటిజన్లు. తప్పుగా అర్ధం చేసుకున్నామా.? లేదంటే, గట్టిగా కోసేయాలనే అలాంటి పదజాలం వాడిందా.? అంటూ నెటిజనం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఏమో, రాశీ ఖన్నా ఉద్దేశ్యం ఏముందో.. ఆమె సవివరంగా చెబితే తప్ప.. ఆమె ట్వీటులో పరమార్ధం ఏంటో.. తెలిసి రాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్లు వేస్తే.. ట్రోలింగ్ మామూలుగా ఉండదని రాశీ ఖన్నాకి తెలియదంటారా.? తెలిసే కావాలని ఇలా చేసిందంటారా.?
Also Read: సిగరెట్టు.. అందాల భామల కనికట్టు.!
అంత నిస్సిగ్గుగా ఎలా ట్రోలింగ్ చేస్తారో.! మీ ఇంట్లో ఆడవాళ్ల మీద ఇలాంటి కామెంట్లే వేస్తారా.? అని అమాయకంగా ప్రశ్నించే సో కాల్డ్ అందమైన భామలు ఇప్పుడీ అందాల రాశి ట్వీట్‌కి అర్ధమేంటో.. ఆ ట్వీట్ వెనక పరమార్ధమేంటో వివరంగా చెప్పి కాస్త పుణ్యం మూట కట్టుకోవచ్చు కదా.