Radhe Shyam సినిమా నుంచి ‘విక్రమాదిత్య’ టీజర్ వచ్చేసింది. ఎవరీ విక్రమాదిత్య.? ఏం చేస్తుంటాడు.? ‘నాకు అన్నీ తెలుసు. కానీ, చెప్పను..’ అంటూ చాలా విషయాల గురించి విక్రమాదిత్య తనదైన స్టయిల్లో చెబుతూ వున్నాడు ప్రోమోలో.
ఇంతకీ విక్రమాదిత్య ఎవరంటే, అతనో Palmist.. అదేనండీ హస్త సాముద్రిక నిపుణుడు. ఈ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రోమోలోని ఒక్కో విజువల్ హాలీవుడ్ స్థాయి.. అంతకు మించి అనేలా వుంది. ‘నేను దేవుడ్ని కాను.. కానీ, మీ అందరి లాంటోడ్ని కూడా కాదు..’ అని విక్రమాదిత్య చెప్పడం మరో విశేషం.
Radhe Shyam అంతకు మించి..
ప్రభాస్, ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. ఇప్పుడు ఏకంగా తనది హాలీవుడ్ రేంజ్.. అన్నట్టుగా ‘విక్రమాదిత్య’ పాత్రలో ఒదిగిపోయినట్టున్నాడు. ఆ స్టైలింగ్.. ఆ మేకింగ్.. వారెవ్వా.. అని తీరాల్సిందే. పూజా హెగ్దే (Pooja Hegde) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే.
Also Read: డార్లింగ్ ప్రభాస్.. ‘బాహుబలి’ ఆఫ్ ఇండియన్ సినిమా.!
‘జిల్’ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ‘రాధేశ్యామ్’ తెలుగుతోపాటు హిందీ, తమిళ సహా పలు భాషల్లో విడుదల కాబోతోంది. 2022 సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విక్రమాదిత్యగా ప్రభాస్.. ఏం చేయబోతున్నాడు.?
‘రాధేశ్యామ్’ ఓ లవ్ స్టోరీ.. అంటూ ప్రచారం జరిగింది. కానీ, అంతకు మించి.. ఇందులో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే, సినిమా విడుదలయ్యదాకా వేచి చూడాల్సిందే. హస్త సాముద్రిక నిపుణుడైన విక్రమాదిత్య చేయబోయే అద్భుతాలెంత అద్భుతంగా వుండబోతున్నాయో ప్రోమోతో చెప్పకనే చెప్పేశారు మేకర్స్.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా (Happy Birthday Prabhas) ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) నుంచి వచ్చిన ‘విక్రమాదిత్య’ ప్రోమో.. మొత్తం ఇండియన్ సినిమాకే వెరీ వెరీ స్పెషల్ గిఫ్ట్.. అని అభిమానులంటున్నారు.