Rafale Droupadi Murmu Shivangi.. రాష్ట్రపతి అంటే, సుప్రీం కమాండర్.. త్రివిధ దళాధిపతి..! ఆ సుప్రీం కమాండర్, యుద్ధ విమానంలో విహరిస్తే.! అదో అద్భుతమైన సందర్భం.!
రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతి, సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము, తాజాగా ఈ రోజు యుద్ధ విమానంలో విహరించారు.

హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి, రాఫెల్ యుద్ధ విమానం నింగిలోకి దూసుకెళ్ళింది. ఆ యుద్ధ విమానంలో, ఓ పైలెట్ సహా, ద్రౌపది ముర్ము ప్రయాణించారు.
సుప్రీం కమాండర్ రెండో సారి..
యుద్ధ విమానాల్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు.. విహరించడం ఇదే తొలిసారి కాదు.! గతంలోనూ, పలువురు ప్రముఖులు యుద్ధ విమానాల్లో విహరించారు.
అయితే, రెండు యుద్ధ విమానాల్లో విహరించిన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి ఎక్కారు.

2023లో తేజ్‌పూర్ విమానాశ్రయం నుంచి యుద్ధవిమానంలో నింగిలోకి దూసుకెళ్ళారు. అప్పుడు ద్రౌపది ముర్ము ప్రయాణించిన యుద్ధ విమానం సుఖోయ్ 30 ఎంకేఐ.
సుఖోయ్ యుద్ధ విమానంలో, అంతకు ముందు రాష్ట్రపతిగా పని చేసిన ప్రతిభా పాటిల్ కూడా విహరించారు. 2009లో ఆమె ఈ ఘనతను సాధించారు.

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో పూణే ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్ 30 ఎంకెఐ యుద్ద విమానంలో విహరించారు.
Rafale Droupadi Murmu Shivangi.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట శివంగి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అంబాలా ఎయిర్ బేస్ సందర్శన సమయంలో, పైలట్ దుస్తుల్లో రాష్ట్రపతి వెంట శివంగి కనిపించడం సంచలనంగా మారింది.
శివంగి అసలు పేరు శివాంగి సింగ్. శివాంగి సింగ్, మహిళా పైలట్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాఫెల్ యుద్ధ విమానం ప్రధాన ఆకర్షణగా నిలవగా, వైమానిక దళ శకటంపై శివాంగి సందడి చేశారు.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
తొలుత మిగ్ విమానాల్ని నడిపే అనుభవం సంపాదించుకున్న శివాంగి సింగ్, ఆ తర్వాత రాఫెల్ యుద్ధ విమానాల్ని నడిపారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో, భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కూలిన రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన పైలట్ శివాంగి.. అంటూ దుష్ప్రచారానికి తెగబడింది.
ఆ శివాంగి సింగ్, రాష్ట్రపతి రాఫెల్ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణగా నిలవడం గమనార్హం.
