Rahul Gandhi Disqualified.. డెమోక్రసీ.. ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం.! వీటి గురించి తరచూ పెద్దయెత్తున చర్చ జరుగుతుటుంది మన దేశంలో. జరగాలి కూడా.! అందరూ గట్టిగా మాట్లాడేవాళ్ళే.!
కానీ, డెమోక్రసీకి విలువిచ్చేవారెవరు.? రాజ్యాంగానికి లోబడి వ్యవహరించేదెవరు.?
వాక్ స్వాతంత్ర్యపు హక్కు వుందంటాడు.. బూతులు తిట్టడమే రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు అంటాడు.! ఇదీ నేటి భారతం.
Rahul Gandhi Disqualified.. రాహుల్‌పై అనర్హత వేటు.!
‘మోదీ’ అన్న పదం చుట్టూ వివాదం. నీరవ్ మోదీ అనే ఓ ‘దొంగ’ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ, పరువు నష్టం కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది.
నీయమ్మ మొగుడు.. అనకపోతే, అసలు రాజకీయ నాయకుడే కాదని.. తెలుగునాట ఓ పార్టీ బూతు పాఠాలు చెబుతోంది.!
ఓ ఎమ్మెల్యే, కనిపిస్తే ఏ ఆడదానికైనా ముద్దు పెట్టెయ్యాలి.. లేదంటే, కడుపు చేసెయ్యాలంటాడు.!
జనాన్ని దోచేసినోళ్ళు కీలక పదవుల్లో కూర్చుంటున్నారు.. చట్టాల్లోని లూప్ హోల్స్ ఉపయోగించుకుని.. కోర్టుల్నే సవాల్ చేస్తున్నారు.!
తిట్టడం ఓ కళ, తిట్టించుకోవడం అంత కంటే గొప్ప కళ అయిపోయింది రాజకీయాల్లో.!
దొంగలు దోషులుగా నిరూపితమయ్యేదెప్పుడు.? కొందరి విషయంలోనే అనర్హత ఎందుకు.? అందరూ ఎలా ఆ ‘వేటు’ తప్పించుకోగలుగుతున్నారు.?
Mudra369
రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అంతే, లోక్ సభ సెక్రెటేరియట్, రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించేసింది. అన్నీ చకచకా జరిగిపోయాయ్.!
పరువు నష్టం కేసు.. దోషిగా తేలిన ప్రజా ప్రతినిథి.. అనర్హత వేటు.. ఇలా వేర్వేరుగా చూడాలి. అన్నీ కలగలిపితే, రిజల్ట్ అత్యంత వివాదాస్పదంగా వచ్చింది.
వ్యవస్థలెలా పనిచేస్తున్నాయ్.?
దేశాన్ని దోచేసిన రాజకీయ నాయకుల కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ‘విచారణ’ సాగుతూ సాగుతూ వుంటాయ్.. అదీ ఏళ్ళ తరబడి.. దశాబ్దాల తరబడి.
ఆయా కేసుల్లో రాజకీయ నాయకులు దోషులుగా తేలితే, వ్యవస్థ బాగుపడుతుంది కదా.? కానీ, అలా జరగనివ్వరు.
రకరకాల రాజకీయ అవసరాల నిమిత్తం.. కీలక పదవుల్లో వున్న అవినీతి రాజకీయ నాయకుల్ని కాపాడుతుంటుంటారు అధికారంలో వున్నోళ్ళు.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ఏ కేసుని ఎలా విచారించాలో కోర్టులకే సుద్దులు చెప్పే రాజకీయ నాయకులు.. జడ్జిలపై భయంకరమైన ఆరోపణలు చేసే రాజకీయ నాయకులు.. బెదిరింపులకు దిగే రాజకీయ నాయకులు.. ఇదీ మన ఘన భారతం.!
వ్యవస్థలు అందరి కోసం పనిచేస్తున్నాయా.? కొందరి కోసమే వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నారా.?
దర్యాప్తు సంస్థల్ని ‘పెంపుడు జంతువుల్లా’ ఎందుకు అధికారంలో వున్నోళ్ళు చూస్తున్నారు.?
రాజకీయాలకతీతంగా పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థ, అధికార పార్టీకి కట్టుబానిస అవుతోందెందుకు.?
చాలా ప్రశ్నలున్నాయ్.! సమాధానాలే దొరకవ్.! ఇది మన ఘన భారతం.!
ఇక్కడ హక్కులుంటాయ్.! కానీ కొందరికే.! చట్టాలుంటాయ్..
కానీ, అవీ కొందరికే.! శిక్షలుంటాయ్.. తప్పు చేసినోళ్ళందరికీ కాదు..!
అవి కూడా కొందరికే.!
Mudra369
దేశంలో ఇప్పుడు వివిధ కోర్టుల్లో వున్న పరువు నష్టం కేసులు తీస్తే, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేసి, తీర్పులు ఇచ్చే పరిస్థితి వుంటే.. అసలంటూ చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులనేవారే వుండరేమో.!
పోతోంది.. పరువు పోతోంది.! కాదు కాదు, పోయింది.! డెమోక్రసీ పరువు పోయింది.! రాహుల్‌పై అనర్హత వేటు పడిందని కాదు.! ఇంకా చాలామందిపై అనర్హత వేటు పడనందుకు.!