Rajinikanth Touches Yogi Feet.. ఓ సంఘటనని ఎలా చూడాలి.? ఎలా చూస్తున్నారు.? అన్నదానిపై ఎవరైనా జడ్జిమెంట్ అంత తేలిగ్గా ఎలా ఇచ్చేయగలుగుతారు.?
సినీ నటుడు రజనీకాంత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ‘యోగి’కి పాద నమస్కారం చేశారు రజనీకాంత్.
వయసులో యోగి ఆదిత్యనాథ్, రజనీకాంత్ కంటే చిన్న.! తన కంటే వయసులో చిన్నవారైన ‘యోగి’ కాళ్ళకు రజనీకాంత్ నమస్కారం చేయడమేంటి.?
Rajinikanth Touches Yogi Feet.. అందులో తప్పేముంది.?
యోగి ఆదిత్యనాథ్ పేరులోనే ‘యోగి’ అన్న ప్రస్తావన వుంది. నిజమే.! ఆయన ‘యోగి’.! సరే, ఆ ‘యోగి’ వెనుక వున్న విమర్శలు.. ఆ కథ అది మళ్ళీ వేరే.!
రజనీకాంత్‌కి ఆధ్మాత్మిక చింతన ఎక్కువ.! సినిమాలతో ఎంత బిజీగా వున్నా, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు వున్నా.. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి కొన్ని రోజులపాటు అక్కడ యోగధ్యానంలో మునిగిపోతుంటారు.
అలా, ఆధ్మాత్మిక చింతనలో భాగంగానే, యోగి ఆదిత్యనాథ్‌ని ‘యోగి’లా రజనీకాంత్ భావించి, ఆయన కాళ్ళకు నమస్కరించి వుండొచ్చు.!
తప్పు కాదా మరి.?
ప్రతి చిన్న విషయమూ ఈ రోజుల్లో వివాదాస్పదమే.! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి రజనీకాంత్ నమస్కరించడం చాలామందికి నచ్చట్లేదు.
యోగి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే, మీడియా కెమెరాలకు దూరంగా రజనీకాంత్ ఆ పని చేసి వుండాల్సింది.
కానీ, అన్ని మీడియా కెమెరాలు లెన్సులప్పగించి చూస్తున్నప్పుడే, రజనీకాంత్ ఎందుకలా చేశారు.? అన్నది ఓ ప్రశ్న.
ఎవరి గోల వారిదే.! తప్పొప్పుల పంచాయితీ వల్ల ప్రయోజనం లేదు. కొన్ని రోజులు ఇదొక ‘ట్రోల’ మెటీరియల్ అంతే.! ఆ తర్వాత అంతా మామూలే.!
Also Read: పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్.! ఆ నోళ్ళు మూతపడతాయా.?
తన తాజా చిత్రం ‘జైలర్’ సూపర్ హిట్ అయిన దరిమిలా, రజనీకాంత్.. ‘యోగి’ ఆశీస్సులు తీసుకున్నారన్నది ఓ ప్రచారం.
ఇంతకీ, ‘యోగి’ ఆదిత్యనాథ్‌తో భేటీ సందర్భంగా రాజకీయ చర్చలేమైనా జరిగాయా.? తమిళ సూపర్ స్టార్ ఎందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీకి వెళ్ళినట్టు.?
ఈ మొత్తం వ్యవహారంలో తమిళ ఆత్మగౌరవం దెబ్బతిందనే ప్రచారం వెనుక వాస్తవమెంత.! అబ్బో.. ఇలా ప్రశ్నలు చాలానే.!