బిగ్‌హౌస్‌లో రక్తం చిందించాడో (Bigg Boss Telugu 3 Blood) హౌస్ మేట్. ఫిమేల్ కంటెస్టెంట్ ప్యాంటులో చెయ్యి పెట్టాడు ఓ మేల్ కంటెస్టెంట్. ఇది జస్ట్ గేమ్ మాత్రమేనని ఎలా అనుకోగలం.? కానీ, ఇవేమీ బిగ్ హౌస్‌లో కొత్త కాదు. ఆ మాటకొస్తే, ఇలాంటివి ముందు ముందు చాలానే చూడాల్సి వస్తుంది.
బూతులు తిట్టుకోవడం, ఈ క్రమంలో కంటెస్టెంట్లు తమ స్థాయిని తగ్గించేసుకోవడం, భౌతిక దాడులకు పాల్పడటం.. ఇవే బిగ్‌బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటింగ్స్‌ని పెంచుతాయా.? ‘పెద్దమనిషి’ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ ‘షో’ ఇంతలా దిగజారిపోతే ఎలా.?
అటు నాగ్ అభిమానులే కాదు, ఇటు కంటెస్టెంట్ల అభిమానులు, మరోపక్క బుల్లితెర వీక్షకులూ ఎప్పటికప్పుడు షాక్‌కి గురవుతున్నారు బిగ్‌హౌస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో.
అప్పుడు కౌశల్, ఇప్పుడు అలీ..
బిగ్‌బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌లో కౌశల్ మండా, బానుశ్రీ మధ్య వివాదం గుర్తుండే వుంటుంది. యాపిల్ టాస్క్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.?
చెట్టుకున్న యాపిల్స్ విషయమై రెండు గ్రూపుల మధ్య జరిగిన రచ్చ, ఈ క్రమంలో భానుశ్రీ (Bhanu Sri) వద్దనున్న యాపిల్స్‌ని కౌశల్ (Kaushal Manda) లాక్కుంటే, ‘అసభ్యకరంగా నన్ను టచ్ చేశాడు’ అని నిందలేస్తూ భానుశ్రీ ఉపయోగించిన విపరీతమైన భాష.. అప్పట్లో వివాదాస్పదమయ్యింది.
ఆ స్థాయిలో బూతులు, అసభ్యకర పదజాలం చోటు చేసుకోలేదుగానీ, హిమజ ప్యాంటులో అలీ రెజా చెయ్యి పెట్టాల్సి వచ్చింది.. బిగ్‌బాస్ సీజన్ 3 కొత్త టాస్క్ పుణ్యమా అని. చెయ్యి పెట్టింది ప్యాంటు పాకెట్‌లో.. అదీ, అంత అసభ్యకరంగా కాదు. కానీ, అలీని దారుణంగా తిట్టేసింది హిమజ.
అంతకు ముందు హిమజ (Himaja), అలీని (Ali Reza) కాలితో తన్నేసింది కూడా. ఆ తర్వాత కాలు పట్టుకుని క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించినా, అదీ ఓవరాక్షన్ అని తేలిపోయింది. ఊహించని ఈ పరిణామంతో అలీ షాక్‌కి గురయ్యాడు. సందట్లో సడేమియా.. అంటూ తమన్నా సింహాద్రి రంగంలోకి దిగి అలీ – హిమజ మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నించింది.
రక్తం చిందించిన రవి కృష్ణ Bigg Boss Telugu 3 Blood
ఈ బిగ్‌బాస్ సీజన్‌కి (Bigg Boss Telugu 3) సంబంధించి ఎలాంటి వివాదాల జోలికి పోకుండా వున్న కంటెస్టెంట్ ఎవరన్నా వున్నారంటే అది రవికృష్ణ మాత్రమే. దురదృష్టవశాత్తూ తమన్నా సింహాద్రి పెడుతున్న టార్చర్‌ని భరించాల్సి వస్తోంది రవి కృష్ణకి. మరోపక్క, తాజా టాస్క్‌లో రవి కృష్ణ చేతికి గాయమయ్యింది.
ఓ గ్లాస్ బాక్స్‌ని శ్రీముఖి (Sree Mukhi), డంబెల్‌తో పగలగొడితే.. అందులో చెయ్యి పెట్టే క్రమంలో గాయపడ్డాడు రవి కృష్ణ (Bigg Boss Telugu 3 Blood). రక్తం రావడంతో హౌస్‌లో అందరూ షాక్‌కి గురయ్యారు. మెడికల్ రూమ్‌కి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. గాయం మరీ పెద్దది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గాజు పెట్టెని టాస్క్‌లో వుంచడమేంటి.? జరగకూడనిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది.? చేతికి గాయమయ్యింది సరే.. ఆ గలాటాలో గాజు ముక్క ఎవర్నయినా తీవ్రంగా గాయపరిచి వుంటే.? ఈ ప్రశ్నలు సగటు బిగ్‌బాస్ వ్యూయర్స్‌ని వెంటాడుతున్నాయి.
ఎంత రియాల్టీ షో అయితే మాత్రం, టాస్క్‌ల పేరుతో ప్రాణాలతో చెలగాటమాడటం తగదన్నది మెజార్టీ వ్యూయర్స్ అభిప్రాయం. ఒక్కోసారి హౌస్‌లో ఆవేశకావేశాలు హద్దులు దాటేస్తున్నాయి. సో, ఇలాంటి భయంకరమైన, ప్రమాదకరమైన టాస్క్‌లు హౌస్‌లో వుండకపోవడమే మంచిది. కానీ, ఏం చేస్తాం.? టీఆర్పీ కక్కుర్తి కదా.. బిగ్‌బాస్ మనసు మారుతుదని ఆశించలేం.