Table of Contents
Rakul Preet Sing Workouts.. అతి సర్వత్ర వర్జయేత్.! ఔను, కసరత్తులు చేయాలి.. శరీరాన్ని కష్ట పెట్టాలి.! అయితే, దానికీ ఓ పరిమితి వుండాలి.!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ కూడా.! ఆమె చాలాకాలంగా ఫిట్‌నెస్ స్టూడియోలు నిర్వహిస్తోంది. ఇతరత్రా బిజినెస్‌లు కూడా చేస్తోంది.
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు ఈ తరహా వ్యాపారాలు.. వెరసి, రకుల్ ప్రీత్ సింగ్.. నిజంగానే డైనమిక్ బ్యూటీ.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Rakul Preet Sing Workouts.. అందానికీ, ఆరోగ్యానికీ వ్యాయామమే..
తన ఆరోగ్య రహస్యం.. ‘క్రమం తప్పని వ్యాయమమే’ అని చెబుతుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అందులోనూ నిజం లేకపోలేదు.

ఎప్పటికప్పుడు వ్యాయామానికి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. వాటిని చూసి చాలామంది ఇన్‌స్పైర్ అవుతుంటారు కూడా.
అలాంటి రకుల్ ప్రీత్ సింగ్, ఓ ప్రమాదకరమైన వ్యాయామం చేస్తూ, గాయపడి.. ఆసుపత్రి పాలైంది. ప్రస్తుతం పూర్తిగా ఆసుపత్రి బెడ్‌కే పరిమితమయ్యిందట.
గాయం చేసిన వ్యాయామం..
ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. బరువు ఎత్తే క్రమంలో గాయపడినట్లు రకుల్ చెప్పుకొచ్చింది.
ఒక్కోసారి మనసు చెప్పే మాట కూడా వినాలి.. అతి విశ్వాసం అస్సలు మంచిది కాదని కూడా వివరించింది రకుల్. నిజమే కదా మరి.!

80 నుంచి 100 కిలోలు, ఆపై బరువులు ఎత్తడం.. అందాల భామలకి ఒకింత కష్టమైన పనే. అయినా, మేమేం తక్కువ.. అని పోటీ పడుతుుంటారు మగ మహారాజులతో.
ఆ పోటీ తప్పు కాదుగానీ..
తప్పేం లేదు.. పోటీ పడొచ్చు.! కానీ, సినిమాల్లో నాజూగ్గా కనిపించడం కోసం తక్కువ తిండి తిని, శరీరాన్ని బక్కచిక్కిపోయేలా చేశాక.. బలం ఎలా వస్తుంది.?
Also Read: HBD Sai Durgha Tej: మళ్ళీ జన్మించావ్ తేజూ.! జై చిరంజీవ.!
ఓ పది పదిహేను రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మనమూ ఆకాంక్షిద్దాం.