Rakul Preet Singh Newboo.. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళెప్పుడు.? ఆ సంగతేమోగానీ, పుట్టబోయే బిడ్డకు ఏం అవసరమన్నది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ బాగా స్టడీ చేసినట్టుంది.!
ఔను, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త యాపారం మొదలు పెట్టింది. ‘న్యూ బూ’ (Newboo) పేరుతో బయోడీగ్రేడబుల్ అలాగే రీ-యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
డిస్పోజబుల్ డైపర్ల ద్వారా పర్యావరణానికి హాని కలుగుతోందని అందరికీ తెలుసు. ఐదొందల ఏళ్ళు పడుతుందట.. డిస్పోజబుల్ డైపర్లు పర్యావరణంలో పూర్తిగా కలిసిపోవడానికి.!
తల్లవకుండానే.. ఆ మాటకొస్తే, పెళ్ళి కాకుండానే.. బయో డీ-గ్రేడబుల్ డైపర్ల ఆలోచన చేసిన రకుల్ ప్రీత్ సింగ్ అభినందనీయురాలే.!
ఇది వ్యాపారం.. అనే విషయాన్ని పక్కన పెడితే, పర్యావరణం పట్ల ఆమెకున్న బాధ్యతను ప్రశంసించకుండా ఎలా వుండగలం.?
Mudra369
తాజాగా ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. పర్యావరణం పట్ల అవగాహన, బాధ్యతతో ‘న్యూ బూ’ పేరుతో బయో-డీగ్రేడబుల్ అలాగే రీ-యూజబుల్ డైపర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఈ అందాల భామ.
Rakul Preet Singh Newboo.. అప్పుడు కాజల్.. ఇప్పుడు రకుల్..
మంచి ఆలోచనే కదా.! అన్నట్టు, ఆ మధ్య కాజల్ అగర్వాల్ కూడా ఓ వ్యాపారం మొదలు పెట్టింది. పెళ్ళయ్యాక.. తల్లయ్యాక ‘న్యూ బోర్న్’ కిడ్స్ అవసరాలకు సంబంధించిన వ్యాపారమది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మాత్రం, తల్లవకుండా.. ఆ మాటకొస్తే పెళ్ళవకుండానే.. పసి పిల్లలకు కావాల్సినవేంటో తెలుసుకుందన్నమాట.
‘ఇది యాపారం’ అనే మాట పక్కన పెడితే, పర్యావరణం పట్ల అవగాహన అలాగే బాధ్యతతో.. అంటోంది గనుక, రకుల్ వ్యాపారాన్ని సమర్థించాల్సిందేనేమో.!
టాలీవుడ్‌పై శీతకన్నేసిందేలా.?
ఇక, రకుల్ సినిమాల విషయానికొస్తే, తెలుగు సినిమాపై ఆమె శీతకన్నేసిందో.. లేదంటే, ఆమే తెలుగు సినిమా పరిశ్రమ సైడేసిందో.. ఈ మధ్య టాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ కనిపించడంలేదు.
బాలీవుడ్‌లో మాత్రం చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అన్న తేడాల్లేకుండా ఎడా పెడా సినిమాలు చేసేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
అన్నట్టు, కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, ‘డాక్టర్ జి’, ‘ఛత్రీవాలీ’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, విమర్శకుల ప్రశంసల్ని రకుల్ అందుకుంటోంది.