Ram Gopal Varma ఎక్కడో ఏదో జరిగితే, ఈయనకెందుకు ఒళ్ళు మండుతుంది.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయితే, కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గాన్ని అమ్మేయడం కోసమేనని చెప్పేంత ‘జ్ఞాని’ రామ్ గోపాల్ వర్మ.
ఆ ‘జ్ఞాని’ ఆర్జీవీ, తాజాగా ‘డైమండ్ రాణి’ కోసం సోషల్ మీడియాలో స్పందించేశాడు.
ఆడాళ్ళని కేవలం ‘సెక్సీ’ యాంగిల్‌లో మాత్రమే చూసే ఆర్జీవీ.. నువ్వు కూడానా ఇస్పేట్ రాజా.?
Mudra369
‘డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తను కూడా ఒక ఇస్పేట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం వుండాలి అని ఒక పి ఫ్యాన్’గా నేను కోరుకుంటున్నాను.. అని ఆర్జీవీ సెలవిచ్చాడు.
ఇస్పేట్ రాజా.! ట్వీట్లు అమ్ముకుంటున్నావా.?
ట్వీట్లు కూడా అమ్ముకునే స్థాయికి ఆర్జీవీ దిగజారిపోయాడన్న విమర్శ వుండనే వుంది. ‘నేను తెలుగులో ట్వీట్లేస్తే అవి నావి కాదు..’ అని గతంలోనే చెప్పుకున్నాడాయన.!
సో, ఆర్జీవీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయ్యిందా.? ఆ ట్వీట్లు నావి కావు, కాస్సేపు ఆ స్పేస్ అమ్మేశానని ఆర్జీవీ చెప్పదలచుకున్నాడా.?
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పవన్ కళ్యాణ్ ‘జనసేన యువశక్తి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ సభ వేదికగా అధికార వైసీపీ మీద విమర్శలు చేశారు.
Ram Gopal Varma.. ఈయనకెందుకు మండింది.?
ఈ క్రమంలోనే మంత్రి రోజాపై ‘డైమండ్ రాణి’ అంటూ విమర్శలు చేశారాయన. పదే పదే తన మీద రోజా విమర్శలు చేయడంపై పవన్ కళ్యాణ్ అలా స్పందించాల్సి వచ్చింది.
‘డైమండ్ రాణీ.. నువ్వు కూడానా.?’ అంటూ పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్ చాలా చాలా గట్టిగా పేలింది. దాంతో, వైసీపీకి ఎలా స్పందించాలో అర్థం కాని దుస్థితి.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
సరే, వైసీపీ – జనసేన మధ్య రాజకీయ విమర్శలనేవి ఆ రెండు పార్టీల మధ్య వ్యవహారం. మధ్యలో ఈ ‘పి’ ఫ్యాన్ ఆర్జీవీ గోలేంటి.?
ఆడాళ్ళని కేవలం ‘సెక్సీ’ యాంగిల్‌లో మాత్రమే చూసే ఆర్జీవీ.. నువ్వు కూడానా ఇస్పేట్ రాజా.?