Table of Contents
Ramarao On Duty Review.. విషయం వీక్‌గా వున్నప్పుడే, మాటలు చాలా హాట్‌గా వుంటాయ్.! ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విషయంలో ఇదే నిజమయ్యింది.
సినిమాలో విషయం లేదని అర్థమయిపోబట్టే, దర్శకుడు వివాదాల్ని ఆశ్రయించాడు. ట్విట్టర్ రెట్టలంటూ సెటైర్లేశాడు.! అదీ రివ్యూల గురించీ, సగటు సినీ అభిమానులైన కొందరు నెటిజన్ల గురించీ.!
అప్పటికి ఆ వివాదాస్పద కామెంట్స్, సినిమా పట్ల నెగెటివ్‌గానో, పాజిటివ్‌గానో ఇంట్రెస్ట్ కలిగించి వుండొచ్చు. కానీ, ఆ అత్యుత్సాహం సినిమాని నిండా ముంచేసిందనుకోండి.. అది వేరే సంగతి.
థియేటర్లలో సినిమా చూడ్డానికి సగటు ప్రేక్షకుడు ఇంకా ఇష్టపడటంలేదు. సినిమాలో కంటెంట్ బలంగా వుందని ప్రేక్షకుడికి అనిపిస్తేనే, థియేటర్ల వైపు చూస్తున్నాడు.
ఓటీటీలోనూ అంతే.!
‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో ప్రేక్షకులు సినిమాని లైట్ తీసుకున్నారు. ఓటీటీలో ట్రై చేద్దాంలే అనుకున్నారు. ఓటీటీలో రానే వచ్చింది.!

సినిమాలో విషయం లేదని తేలిపోయింది కదా, ఓ అరగంటలో కానిచ్చేద్దాం.. అనుకున్నారు చాలామంది. అదే జరిగింది కూడా.! అసలు విషయమేంటో చూద్దామనుకుని, కొంత టైమ్ వేస్ట్ చేసుకుని చూసినోళ్ళూ లేకపోలేదు.
సినిమా మొదలైంది, సీన్లు సాగుతూ సాగుతూ వెళ్ళాయ్.! చూస్తున్నంతసేపూ, ‘ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నారు.?’ అని ప్రతి నటుడి విషయంలోనూ అనిపిస్తుంది.
జస్ట్ ఓవరాక్షన్..
అదే, ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రత్యేకత. ఆఖరికి నాజర్ లాంటి సీనియర్ అండ్ సిన్సియర్ యాక్టర్ కూడా ‘అతి’ చేయాల్సి వచ్చింది. ఇదీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ దుస్థితి.
బహుశా డైరెక్టర్‌కి వున్న ఆ ‘అతి’ కాస్త, నటీనటులందరిపైనా అంతటి ‘అతి’ ప్రభావం చూపిందన్నమాట.. అనుకుంటాడు ప్రేక్షకుడు సినిమా పూర్తయ్యేసరికి.
తొలి రోజు సినిమాని థియేటర్లలో చూసి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తే, ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది.
Ramarao On Duty Review.. టోటల్ వేస్ట్.! అంతా లూటీ.!
నిజానికి, ఓటీటీలో సైతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ని చూడాల్సి వస్తే, అంతకన్నా టైమ్ వేస్ట్ వ్యవహారం ఇంకోటుండదు.
సినిమాని బాగా తీయడానికి అవసరమైన కాన్‌ఫ్లిక్ట్ అయితే సబ్జెక్టులో వుంది. కానీ, తీయడమే చేతకాలేదు. నటీనటులకు నటించడం చేతకాదా.? అని చాలా సందర్భాల్లో అనిపిస్తుందంటే, ఎలా తీశారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Rhea Chakraborty ఈజ్ బ్యాక్.! గ్లామర్ షో షురూ.!
‘రామారావు ఆన్ డ్యూటీ’.. థియేటర్లకెళితే పర్సులోని కరెన్సీ లూటీ.. దాంతోపాటు, టైమ్ లూటీ.! ఇంట్లో ఓటీటీలో చూస్తే, డేటా లూటీ.. టైమ్ లూటీ.!