Ramcharan International Super Star ‘నీ తండ్రి ఎవరన్నది కాదు.. నువ్వు ఎవరన్నది ముఖ్యం.!’ అంటూ కొన్నాళ్ళ క్రితం ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి.
వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. కాకపోతే, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌ని కించపర్చేందుకు ఆయన ఆ ‘మాట’ వాడాడు. అదే ఆయన చేసిన అతి పెద్ద తప్పు.!
గొప్పతనమంటే.. మాటల్లో వుండదు.!
సంస్కారం తెలియనప్పుడు ‘గొప్పతనం’లో అర్థం లేదు.!
వ్యక్తిత్వ హననమే ఎజెండా అయితే.. జీవితానికి అర్థమే వుండదు.!
మేధావినని చెప్పుకుంటే సరిపోదు.. హుందాతనం అవసరం.!
బాడీ షేమింగ్ చేసేవాడసలు మనిషే కాదు.!
Mudra369
రామ్ చరణ్‌కి సర్జరీ చేయించారనీ, ఇంకోటనీ.. ఏవేవో విపరీత వ్యాఖ్యలు చేశాడు యండమూరి వీరేంద్రనాథ్. అప్పటివరకూ ఆయన మీద వున్న అభిమానం కాస్తా చాలామందికి పోయింది.
Ramcharan International Super Star.. తండ్రిని మించిన తనయుడు..
ఆ రామ్ చరణ్.. ఇప్పుడు తండ్రి గర్వ పడేంత స్థాయికి ఎదిగాడు. ప్రపంచ సినిమా ఇప్పడు రామ్ చరణ్ వైపు చూస్తోంది.

అంతర్జాతీయ వేదికలపై ‘ఇంటర్నేషనల్ సూపర్ స్టార్’ అనే గుర్తింపుని రామ్ చరణ్ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ప్రముఖులు సైతం, రామ్ చరణ్‌ని కొనియాడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆనాటి యండమూరి వీరేంద్రనాథ్ మాటల ప్రస్తావన మళ్ళీ వస్తోంది.! వస్తుంది మరి. అప్పట్లో ఆయన ప్రదర్శించిన పైత్యం అలాంటిది.
Also Read: ఆర్జీవీ కుక్కల గోల.! ఇదో పబ్లిసిటీ లీల.?
‘ఎవర్నీ తక్కువ అంచనా వేయకు. నీకు నువ్వే గొప్ప.. అనుకుని, ఇతరుల్ని కించపర్చకు.. అది నీ స్థాయిని తగ్గిస్తుంది..’ అంటూ నెటిజనం కడిగి పారేస్తున్నారు.
వయసు పెరిగితే సరిపోదు.! హుందాతనం వుండాలి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం గొప్ప కాదు.! వాటిని కాపాడుకోగలగాలి. అహంకారం ఎక్కువైపోతే, ఇదిగో.. ఇలానే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళ్తారు తెలియకుండానే.