Ramcharan Orange Movie.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ‘ఆరెంజ్’ ఒకటి. అప్పట్లో ఈ సినిమా నష్టాల కారణంగానే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు నటుడు, నిర్మాత నాగబాబు.
రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సరసన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది.
జెనీలియా ఈ సినిమాలో చేసిన ఓవరాక్షన్ (దర్శకుడు ఆమె పాత్రని అలా డిజైన్ చేశాడు) ఈ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం.
జెనీలియాతోపాటు కొత్త భామ షాజాన్ పదామ్సీ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించింది. నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ అయినా, షాజాన్ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది.
Ramcharan Orange Movie.. రీ-రిలీజ్ ఎందుకు.?
తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తారల పుట్టినరోజు నేపథ్యంలో ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనలతో హంగామా చేస్తున్నారు.

ఈ కోణంలోనే ‘ఆరెంజ్’ కూడా రీ-రిలీజ్ అవుతోంది. అప్పటికప్పుడు సరికొత్తగా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే, ‘ఆరెంజ్’ లాంటి ఫ్లాప్ సినిమాకి ఎందుకింత హంగామా.? అన్న ప్రశ్నలూ వస్తున్నాయ్.
‘చెన్నకేశవరెడ్డి’ సినిమాకి చేసినప్పుడు, ‘ఆరెంజ్’ (Orange Movie) సినిమాకి ఎందుకు చేయకూడదు.? అన్న వాదనా లేకపోలేదు.
మ్యూజికల్ హిట్..
రామ్ చరణ్ కెరీర్‌లోనే పాటల పరంగా చూసుకుంటే ‘ఆరెంజ్’ వెరీ వెరీ స్పెషల్. సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సంచలనాలే. ఇప్పటికీ ఆ పాటలు కొత్తగా వుంటాయ్. రామ్ చరణ్ డాన్సులు కూడా అంతే.!
సో, జెనీలియా (Genelia D Souza) ఓవరాక్షన్‌ని పక్కన పెడితే.. సినిమాలోని పాటల్ని థియేటర్లలో అభిమానులు ఎంజాయ్ చేసే అవకాశం అయితే లేకపోలేదు.
Also Read: Rana Daggubati.. ‘ది టెర్మినేటర్’ అట.!
అభిమానులే ఈ సినిమా కావాలని డిమాండ్ చేస్తున్న దరిమిలా, దాన్ని క్యాష్ చేసుకోవడంలో తప్పేముంది.? పైగా, ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనతో వచ్చే సొమ్ముని జనసేన పార్టీ కోసం వినియోగిస్తారట.
