Table of Contents
Ramcharan Peddi Chikiri Lyrics.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఇలా విడుదలై.. అలా ‘చికిరి చికిరి’ లక్షల్లో కాదు, కోట్లల్లో వ్యూస్ కొల్లొగొడుతోంది. జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీకి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి.
రామ్ చరణ్ డాన్సులు, దానికి తోడు.. జాన్వీ కపూర్ గ్లామర్.. ఇవే కాదు, రెహమాన్ సంగీతం.. ఆపై అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. అన్నీ కలిసి ‘చికిరి చికిరి’ సాంగ్‌ని చార్ట్ బస్టర్స్‌లో నిలబెట్టేశాయ్.
ఎక్కడ విన్నా ఇదే సాంగ్.! సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ తాలూకు రీల్స్ దర్శనమిస్తున్నాయ్. ‘చికిరి చికిరి’ సాంగ్, ఆ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది.
‘చికిరి చికిరి’ సాంగ్‌ని మీరూ సరదాగా ఆలపించేద్దామనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం, మీ కోసమే ఈ తెలుగు లిరిక్స్.! పండగ చేస్కోండిక.!
Ramcharan Peddi Chikiri Lyrics.. పల్లవి:
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్కా..
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క..
దీనందాలో లెక్క..
దీనేషాలో తిక్క..
నా గుండెల్లో పోత్తా ఉందే ఉక్కా..
చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చికిరి…
పడతా పడతా పడతా ఎనకె ఎనకే పడతా..
సరుకు సామాను సూసి మీసం లేసి ఏసే కేక..
చికిరి చికిరీ.. గుంటే సురకెట్టేశాక..
ముందు ఎనకా ఈడే గాలికొగ్గేసిందే పిల్లా..
చికిరీ చికిరీ ఆడంగుల మచ్చయిందే ఇల్లా..
View Song Here: Chikiri Chikiri Song | Peddi |
చరణం 1
ఆ ముక్కుపై నెట్టి కోపం
తొక్కేసావే ముక్కెరందం..
చింతాకులా ఉందే పాదం
సిర్రాకులే నడిసే వాటం..
ఏం బుక్కావో అందాలు ఒళ్ళంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు..
కూసింతే సూత్తే నీలో వగల
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిసిన సోటంతా పొర్లు దండాలు..
చరణం 2
నచ్చేసావే మల్లెగంప
నీ అందాలే నాలో దింపా..
ఏం తిన్నావో కాయ దుంప
నీ యవ్వారం వరద ముంపా
నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే..
సొంగా కార్చుతుందే గుండె..
బెంగ నిదరని మింగేహిందే,
సేసెయ్యాలేదోటి..
