Ramcharan TDP CBN Balakrishna.. నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద అమితమైన అభిమానం ప్రదర్శించేస్తున్నారు.
‘రామ్ చరణ్.. ఇకపై నువ్వు మావాడివి’ అంటూ నందమూరి అభిమానులు.. మరీ ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు భరోసా ఇస్తున్నారు. బాసటగా నిలుస్తున్నారు.
ఇదంతా మొన్నీమధ్యన రామ్ చరణ్, స్వర్గీయ ఎన్టీయార్ (Nandamuri Taraka Ramarao SR) శత జయంతి వేడుకల్లో పాల్గొనడం వల్లనే.
Ramcharan TDP CBN Balakrishna మా చంద్రబాబునాయుడు గారు..
‘మా చంద్రబాబునాయుడుగారు..’ అంటూ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తావించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టలేని ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయి.
ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) మీదున్న మంటని, రామ్ చరణ్ మీద ప్రేమగా మార్చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు.

చంద్రబాబు – రామ్ చరణ్ (Man Of Masses Ram Charan) కలిసి వున్న ఫొటోల్ని వైరల్ చేసి పారేస్తున్నారు. ఇక్కడ, టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులకి ఇంకో అడ్వాంటేజ్ కూడా వుంది.
టీడీపీ – జనసేన పొత్తు ప్రచారం నేపథ్యంలో, చరణ్ (Global Star Ram Charan) అభిమానుల ఓట్లు తమవైపు కన్వర్ట్ అయ్యేలా టీడీపీ శ్రేణులు ఈ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీయార్ పరిస్థితేంటి.?
జూనియర్ ఎన్టీయార్ – రామ్ చరణ్ (Ram Charan) మంచి స్నేహితులే. కానీ, ఈ వ్యవహారంతో.. ఇద్దరి అభిమానుల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
నిజానికి, ఇందులో రామ్ చరణ్‌ని తప్పు పట్టడానికేమీ లేదు. గౌరవంగా పిలిచారు, అంతే గౌరవంగా ఆ కార్యక్రమానికి వెళ్ళాడు. హుందాగా వ్యవహరించాడు.
Also Read: Dimple Hayathi Dishyum.. డీసీపీతో డింపుల్ డిష్యుం.!
ఏ కారణాల వల్లనో ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ (Man Of Masses Ram Charan) హాజరు కాలేకపోయాడంతే. ఆ కారణాలేంటో ఆయనకు మాత్రమే తెలుసు.
ఇంతకీ, రామ్ చరణ్ మీద నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చూపుతున్నది స్వచ్ఛమైన ప్రేమేనా.? ఏమో, చెప్పలేం.. ఇదంతా నిజమని నమ్మలేం.!
కొసమెరుపేంటంటే, జూనియర్ ఎన్టీయార్‌కి మద్దతుగా అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు రంగంలోకి దిగి, రామ్ చరణ్ మీద బూతులు తిడుతుండడం.