Ramoji Rao Margdadarsi పెద్దాయనా.. పెద్దాయనా.. ఇది పాపిష్టి లోకం పెద్దాయనా.. అంటూ కొందరు ఆయన పట్ల విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు.!
మీడియా మొఘల్ రామోజీరావు గురించే ఇదంతా.! తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అనుకూల మీడియాలో అగ్రస్థానం ‘ఈనాడు’దే.! ఇది బహిరంగ రహస్యం.
ఆ తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) ‘రాజగురువు’ అనే గుర్తింపు కూడా రామోజీ రావుకే (Media Moghal Ramoji Rao) వుంది.!
ఈనాడు.. పచ్చళ్ళ (Priya Pickles) వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారం.. ఇలా చాలానే వున్నాయ్. అన్నటికీ మించి రామోజీ ఫిలిం సిటీ.!
Ramoji Rao Margdadarsi అంతలా ఎదిగిన రామోజీ..
మీడియా రంగంలో బహుశా రామోజీ రావు (Ramoji Rao Eenadu) సాధించిన ఘనతలు ఇంకెవరికీ దక్కవేమో.! ఆ స్థాయికి ఎదిగారాయన. కానీ, మార్గదర్శి వివాదంలో ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కోట్లాది రూపాయల కుంభకోణమట.!
పతనం అంచున ‘మీడియా మొఘల్’ రామోజీరావు సామ్రాజ్యం.?
ఏళ్ళ తరబడి నడుస్తున్న కేసులో కీలకమైన ముందడుగు పడినట్లేనా.?
రామోజీరావు అరెస్టయ్యే అవకాశాలెంత.?
రాజకీయమా.? కక్ష సాధింపు చర్యలా.?
ఆధిపత్య పోరులో భాగంగానే ఓ మీడియా సంస్థ అధినేత కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వం, ఇంకో మీడియా సంస్థ అధినేతను ఇరికిస్తోందా.?
ఈ రాజకీయ ఆరోపణల వెనుక మతలబు ఏంటి.?
Mudra369
చివరికి మంచాన పడి, ఏపీ సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంత కష్టమొచ్చింది పెద్దాయనకి.!
‘అనారోగ్యంతో బాధపడుతున్నారు’ అని రామోజీరావు తరఫున ఓ వాదన వినిపిస్తోంటే, ‘ఆరోగ్యంగానే వున్నారు… విచారణ సజావుగానే సాగింది’ అనే వాదన ఇంకో వైపు నుంచి వినిపిస్తోంది.
ఈ కేసు ఎప్పటికి తేలుతుంది.?
నిన్నగాక మొన్న నమోదైన కేసు కాదిది.! ఏళ్ళ తరబడి నడుస్తున్నదే.! ఈ విచారణతో రామోజీరావు అరెస్టవుతారా.? అంటే, ఏమో.. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
వాట్ నెక్స్‌ట్.? అన్నది మాత్రం, అంచనా వేయలేం. ఈ ఒక్క కేసుతో రామోజీ ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోయాయనీ చెప్పడానికి వీల్లేదు.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ఇది రాజకీయం.! ఇదింతే.! ఒక్కటి మాత్రం నిజం.. మీడియా మొఘల్ రామోజీరావు.. మంచమ్మీద పడి వుండడం చూసేవాళ్ళకి అస్సలు రుచించడంలేదు. ఆయనేనా ఈయన.? అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది.!