ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేత’ (Ramsetu Review) సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలేర్పడటానికి కారణం టైటిల్.!
‘రామ్ సేతు’ అనేది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. శ్రీరాముడు నిర్మించిన వారధిని ‘రామ్ సేతు’ అని చెబుతుంటాం.
రావణుడు, సీతమ్మని అపహరించి లంకకు తీసుకెళితే, తన ధర్మ పత్ని సీతాదేవిని తీసుకొచ్చేందుకు రావణుడితో యుద్ధం చేయడంకోసం రాముడు నిర్మించిందే ‘రామ్ సేతు’.
రాముడు ఇంజనీరింగ్ చదివిందెక్కడ.?
కొంతమంది కుహనా మేధావులు శ్రీరాముడు ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు.? అని ప్రశ్నించిన సందర్భాలున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులూ ఇలాంటి ప్రశ్నలు వేశారు.
అయితే, రామ సేతు అనేది మానవ నిర్మితం అనీ.. వేల ఏళ్ళ క్రితమే అది నిర్మించబడిందని పలు పరిశోధనలు తేల్చాయి.

ఆ రామసేతు వల్లనే, అప్పట్లో సంభవించిన సునామీ నుంచి తమిళనాడులోని చాలా తీర ప్రాంతాలు కొంత మేర రక్షించబడ్డాయి.
సర, అదంతా పక్కన పెడితే, అది మానవ నిర్మితమా.? కాదా.? అన్నది తేల్చడానికి రంగంలోకి దిగుతాడు హీరో ‘రామసేతు’ సినిమాలో.
Ramsetu Review.. ఏదీ ఆ కనెక్టివిటీ.?
‘రామ సేతు’కి వున్న బలమైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అత్యంత జాగ్రత్తగా దర్శకుడు సినిమాని తెరకెక్కించి వుండాలి. కానీ, సినిమా మొత్తం పిల్లలాటలాగానే వుంటుంది.
అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ నటుడు కూడా ఏం చేయాలో పాలుపోనట్టు తెరపై కనిపిస్తాడు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ గురించి చెప్పుకోవడం అనవసరం.
వున్నంతలో సత్యదేవ్ కాస్త ఫర్వాలేదన్పించాడంతే. మిగతా పాత్రధారులెవరూ చేసిందేమీ లేదు, చెయ్యడానికీ ఏమీ లేదక్కడ.
Also Read: పిల్లల్ని కనడానికి పెళ్ళితో పనేంటి.?
కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేని చందాన, సినిమాని ముగించేశారంతే. ఈమాత్రందానికి సినిమా తీయాల్సిన అవసరం వుందా.? అని అనిపించకమానదు.
నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.. అన్నీ సినిమా ‘స్థాయి’కి తగ్గట్టుగానే వున్నాయ్. ఏదీ అంతగా ప్రభావం చూపదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే, ఇదొక దండగమారి ప్రయత్నం.!