Ramya Mokhsa BiggBossTelugu9 Pickles.. రమ్య మోక్ష.. సోషల్ మీడియా సెన్సేషన్ అనొచ్చా.? అనేయొచ్చు.!
ఎందుకంటే, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌కి బోల్డంత మంది ఫాలోవర్లు వున్నారు గనుక.!
ఫిట్నెస్ వీడియోలు, డాన్సులు.. ఇతరత్రా కంటెంట్.. వెరసి, బాగానే పాపులర్ అయ్యింది సోషల్ మీడియా వేదికగా రమ్య మోక్ష.!
పికెల్స్ బ్యూటీగా, రమ్య మోక్షకి మంచి గుర్తింపే వుంది. ఇది కాక, పలు సినిమాల్లో కూడా రమ్య మోక్ష నటిస్తోందిట. అవన్నీ పక్కన పెడితే,
అలేఖ్య పికెల్స్ వివాదం, అనూహ్యమైన రీతిలో పబ్లిసిటీ ఇచ్చింది రమ్య మోక్షకి. నెగెటివ్ పబ్లిసిటీనే అయినా, అది రమ్య మోక్షకి, ‘బిగ్ బాస్’లో కంటెస్టెంట్‌గా అవకాశమిచ్చిన మాట వాస్తవం.
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష, హౌస్‌లోకి వెళుతూనే, కొందరు కంటెస్టెంట్లపై తీవ్రాతి తీవ్రమైన కామెంట్లు చేసింది.
రీతూ చౌదరి మీదా, తనూజ మీద.. ఒకింత అభ్యంతకరమైన వ్యాఖ్యలే చేసింది రమ్య మోక్ష, బిగ్ బాస్‌లో వున్నప్పుడే.! అది ఆమెకి నెగెటివ్ అయ్యింది కూడా.
బిగ్ బాస్ ఆదేశాలు లేకుండా, పనికిమాలిన కామెంట్లు ఏవీ బయటకు వచ్చే అవకాశమే లేదు. అలాంటి చెత్త కామెంట్లే, బిగ్ బాస్‌కి అడ్వాంటేజ్.
తనకిచ్చిన క్యారెక్టర్‌లో రమ్య మోక్ష జీవించేసింది. కానీ, అనూహ్యంగా హౌస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, బిగ్ హౌస్‌లో రమ్య మోక్ష జస్ట్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించిందంతే. అందం వుంది.. టాలెంట్ వుంది.. ఇవేవీ, హౌస్‌లో ఆమె పెద్దగా ప్రదర్శించలేకపోయిందనే వాదన ఒకటుంది.
బిగ్ బాస్ అంటేనే అంత.! ఎవరికి ఎప్పుడు హైప్ వస్తుందో తెలియదు. రమ్య మోక్ష నోటి తీట కారణంగా, రీతూ చౌదరికీ అలానే తనూజకీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పెరిగారు.
మరోపక్క, రమ్య మోక్ష అనే పేరు.. బిగ్ బాస్ ద్వారా మరింతగా జనాల్లోకి వెళ్ళగలిగింది. యూ ట్యూబ్ ఛానళ్ళలో కొన్నాళ్ళు రమ్య మోక్ష హవా కొనసాగనుంది.
