Ranga Ranga Vaibhavanga.. ‘ఉప్పెన’ ఫేం పంజా వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ జంటగా రూపొందిన ‘రంగ రంగ వైభవంగా’ విడుదలకు ముందే ఒకింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సినీ లవర్స్‌లో.!
వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) తొలి సినిమా ‘ఉప్పెన’ తర్వాత, రెండో సినిమాని కూడా ప్రయోగాత్మక కోణంలోనే చేశాడు. అదే ‘కొండపొలం’.
నటుడిగా సినిమా సినిమాకీ పరిణతి సాధిస్తోన్న వైష్ణవ్, తాజాగా ‘రంగ రంగ వైభవం’లో మాత్రం ఫక్తు కమర్షియల్ హీరోలా కనిపిస్తున్నాడు.
క్లాస్ టచ్ ఇస్తూనే, మాస్ యాంగిల్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు వైష్ణవ్. ఆ విషయం సినిమా ప్రోమోస్ చూస్తోంటే అర్థమవుతోంది.
Ranga Ranga Vaibhavanga.. కేతిక శర్మ ముద్దుగా.. బొద్దుగా.. రొమాంటిక్‌గా.!
కేతిక శర్మ (ketika Sharma) గురించి కొత్తగా చెప్పేదేముంది.? ముద్దుగా, బొద్దుగా.. హాటు హాటుగా కనిపిస్తుంటుంది కేతిక. తొలి సినిమా దగ్గర్నుంచీ, అదే తీరు. ఈ సినిమాలో ఇంకాస్త హాట్‌గా, క్యూట్‌గా కనిపిస్తోంది.
Also Read: ప్యారిస్ చెక్కేసిన మలైకా, అర్జున్.! అయితే ఏంటట.?
‘రంగ రంగ వైభవంగా’ టీజర్ విషయానికొస్తే, చాలా బాగా కట్ చేశారు.. హీరో, హీరోయిన్ల మధ్య ఇగోతో కూడిన ప్రేమ.. ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే వుంది. వైష్ణవ్ డిఫరెంట్ లుక్.. అంతకన్నా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించినట్టున్నాడు.

హిట్టు కళ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాకి గీరాశయ దర్శకుడు.