Ranga Ranga Vaibhavamga.. ముద్దంటే చేదా.? అసలా ఉద్దేశ్యం లేదా.? అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ తెలుగు పాట అప్పట్లో జనం నోళ్ళలో బాగా నానింది. అదో సూపర్ హిట్ సాంగ్. అప్పటికీ, ఇప్పటికీ సినిమా ‘ముద్దు’ల్లో చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ‘ముద్దు’ లేకుండా సినిమానే లేదనే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. పైగా, ఇప్పుడు నడుస్తున్నది గాఢమైన లిప్పు కిస్సుల ట్రెండు.!
కొత్త సినిమా ఏదన్నా వస్తోందంటే, ముందుగా ఆ ప్రోమోస్‌లో లిప్ కిస్ కనిపించాల్సిందే. అది గాఢమైన లిప్ కిస్ అవుతుందా.? లేదంటే, జస్ట్ టీజింగ్ లిప్ కిస్ అవుతుందా.? అన్నదే తేడా. ‘లిప్ కిస్’ లేకుండా సినిమా అంటే, అది చాలా కష్టమైన వ్యవహారమే మారిపోయింది యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ విషయంలో.
Ranga Ranga Vaibhavamga సీతాకోక చిలుక ముద్దు.!
కొత్తగా పంజా వైష్ణవ్ తేజ్ సినిమా ద్వారా ప్రచారంలోకి వచ్చింది ‘సీతాకోక చిలుక ముద్దు’. అదేనండీ, ‘బటర్ ఫ్లై కిస్’. హీరోయిన్ కేతిక శర్మ అనగానే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘రొమాంటిక్’ సినిమాలో అస్సలు మొహమాటపకుండా అందాల విందు చేసిన బొద్దుగుమ్మ గుర్తుకొస్తుంది. ఆ బొద్దుగుమ్మే ఈ బటర్ ఫ్లై కిస్ గురించి చెబుతుంది హీరో వైష్ణవ్ తేజ్‌కి.. అదీ సినిమా కోసమే లెండి.
Also Read: ఎంత పని చేశావయ్యా అల్లు అర్జున్.! తప్పు కదా.?
సినిమా పేరు ‘రంగ రంగ వైభవంగా’. ఈ చిత్రానికి దర్శకుడు గీరీశాయ. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాడు గిరీశాయ. తాజాగా ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రోమో వదిలారు. అందులో ‘బటర్ ఫ్లై కిస్’ మాత్రమే చూపించారు.
వెండితెర ముద్దులు.. ఎన్నెన్నో ప్రయోగాలు.!
వెండితెరపై ‘ముద్దుల’ గురించి చాలా రీసెర్చ్.. అందునా మన తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా జరుగుతోందేమో.! సినిమా సినిమాకీ కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు. నటీనటులూ మొహమాటపడటంలేదు. దాంతో, దర్శకుల పని తేలికైపోతోంది.
ఏమో, ముందు ముందు ఇంకెన్ని కొత్త తరహా ‘ముద్దుల్ని’ తెలుగు సినిమాల ద్వారా చూడాల్సి వస్తుందో ఏమో.!