Rashmi Gautam Indian Aunty.. ‘ఆంటీ’ అని ఎవరైనా పిలిస్తే ఒళ్ళు మండిపోతుంటుంది అనసూయ భరద్వాజ్‌కి.! కానీ, రష్మి గౌతమ్ పరిస్థితి వేరు.!
ఇద్దరు జబర్దస్త్ యాంకర్స్ (ఒకప్పుడు) మధ్య ఇంత డిఫరెన్స్ ఏంటబ్బా.? అనసూయకి పెళ్ళయిపోయింది కాబట్టి.. ఎవరైనా ఆంటీ అనడం మామూలేనేమో.!
రష్మి విషయంలో ఎవరైనా ‘ఆంటీ’ అనగలరా.? కానీ, తాను ఆంటీనేనని చెబుతోంది రష్మి గౌతమ్.!
Rashmi Gautam Indian Aunty.. అసలు విషయం ఇదీ..
నిజానికి, అసలు కథ వేరే వుంది. సోషల్ మీడియా వేదికగా రష్మి గౌతమ్ అప్పుడప్పుడూ చాలా యాక్టివ్‌గా వుంటూ వస్తుంటుంది.
ఎవరెవరో ఏవేవో కామెంట్లు పెడుతుంటారు రష్మిని ఉద్దేశించి. వాటికి రష్మి గౌతమ్ వీలు చిక్కినప్పుడల్లా కౌంటర్ ఎటాక్ ఇస్తూ వస్తుంటుంది.
ఓ నెటిజన్, రష్మి గౌతమ్‌ని ఉద్దేశించి ‘నార్త్ ఆంటీ.. సౌత్‌లో ఎందుకు వుంటున్నావ్.? నార్త్‌కే వెళ్ళిపో..’ అంటూ అల్టిమేటం జారీ చేశాడు ట్విట్టర్ వేదికగా.

అంతే, రష్మికి (Rashmi Gautam) ఒళ్ళు మండిపోయింది. ‘నేను ఇండియన్ ఆంటీని..’ అంటూ తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.
ఈ దేశమంతా నాదే.. నీలాంటి కొందరు దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు.. అంటూ మండిపడింది రష్మి గౌతమ్ (Rashmi Gautam).!
‘నేను ఆంటీని కాదు’ అని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తరహాలో అనకుండా, ‘నేను ఇండియన్ ఆంటీ’ అంటూ రష్మి గౌతమ్ వ్యాఖ్యానించడం విశేషమే మరి.!