Rashmi Gautam.. న్యూస్ రీడర్లు తెలుగు భాషని ఎలా ఖూనీ చేస్తున్నారో చూస్తున్నాం. నిజానికి, తెలుగు భాషని చాలా చాలా మార్చేశారు. ప్రముఖ దినపత్రికల్లోనే ‘మారిన తెలుగు’ కనిపిస్తోంది.
తప్పదు.. ప్రపంచం మారుతోంది.. అన్నిట్లోనూ మార్పు వస్తోంది. ప్రభుత్వాలే తెలుగు భాషని పట్టించుకోవడంలేదు. అదో దొండగమారి భాష.. అంటూ ‘మాద్యమాన్ని’ తొలగించేస్తున్న రోజులివి.
అలాంటిది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే గ్లామర్ ప్రపంచంలో ఓ నటి, ఓ యాంకర్.. తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే, సమాజానికి వచ్చే నష్టమేంటి.?
Rashmi Gautam.. తెలుగు తంటా.!
రష్మి మన తెలుగమ్మాయేనా.? అంటే, ఆమెకు ఒరిస్సా అలాగే యూపీ మూలాలు కూడా వున్నాయట. సో, ఆమె తెలుగులో కొంత ‘తేడా’ కనిపిస్తుంటుంది.

ట్రెండీ తెలుగు.. అని కొత్త పేరు పెట్టారిప్పుడు. స్కూల్ విద్య నుంచే ఈ ట్రెండీ టెల్గు కన్పిస్తున్న దరిమిలా, రష్మిని ఎలా తప్పు పట్టగలం.? పైగా, తెలుగు మాద్యమాన్ని పూర్తిగా లేపేస్తున్న రోజులివి.
తన స్లాంగ్ విషయమై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన రష్మి, తాను సీబీఎస్ఈ విద్యను అభ్యసించాననీ, తెలుగులో బాగానే మాట్లాడగలిగినా.. కొంత తేడా వుంటుందనీ చెప్పుకొచ్చింది.
ఆగని ట్రోలింగ్.. ఎందుకీ రచ్చ.?
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొందరు పనీ పాటా లేకుండా రచ్చ చేస్తుంటారు. వారిని కొందరు సెలబ్రిటీలు ఎంటర్టైన్ చేస్తుంటారు. రష్మి చేస్తున్నదీ అదేనా.? అంటే, ఏమో అలాగే అనుకోవాలేమో.!

స్పందించేకొద్దీ ఇంకా పెంట అవుతూనే వుంటుంది. స్పందించకపోతే, ఇదో పరమ రొటీన్ వ్యవహారంగా మారిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు కాస్త మనసుకు కష్టంగా వున్నప్పుడు సెలబ్రిటీలు స్పందిస్తే.. ఇదిగో ఇలాగే తయారవుతుంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి అవార్డొస్తే.. వాళ్ళకి ఏడుపొస్తుంది.!
చివరగా కామెడీ కోసం కొన్ని షోస్‌లో రష్మి తెలుగు మీద సెటైర్లు పడుతుంటాయ్. దాన్ని ఆమె లైట్ తీసుకుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, కకృతి (కక్కుర్తి) అనే ‘పలుకు’కి రష్మి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. జస్ట్ సరదాకే.. అని రష్మి చెబుతున్నాగానీ, ఆ పేరుతో ఆమె ట్రోలింగ్కి గురవుతూనే వుంది.
కొసమెరుపేంటంటే.. రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల దగ్గర్నుంచి మొదలైంది ఈ రచ్చ.