Rashmika Mandanna Bollywood Hungama: బాలీవుడ్‌కి వెళుతున్నారట.? అబ్బే, అలాంటిదేమీ లేదండీ.. ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలతో అస్సలేమాత్రం ఖాళీ లేదు.. బాలీవుడ్ గురించి ఇప్పుడైతే ఆలోచించండిలేదు.! చాన్నాళ్ళ క్రితం రష్మిక, బాలీవుడ్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్య ఇది.
కాదంటే ఔననిలే.! అని ఆ తర్వాత రష్మిక మాటలకు అసలు అర్థం తెలిసింది. ఔను, రష్మిక బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రష్మిక ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయిందిప్పుడు.
Rashmika Mandanna Bollywood Hungama రష్మిక రూటే సెపరేటు.!
ఈ మధ్యనే, హిందీలో ఇంకో సినిమా రష్మిక చేస్తోందట.. అదీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనట కదా.! అంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ‘అబ్బే, అదేం లేదు..’ అని రష్మిక (Rashmika) తరఫున ప్రకటన వచ్చింది.

కానీ, మళ్ళీ ఇప్పుడూ ‘కాదంటే ఔననిలే’ అన్నట్టుగానే అసలు వాస్తవం బయటపడింది.
ఔను, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘యానిమల్’ (Rashmika Mandanna Animal) సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్‌గా ఖరారయ్యింది. చిత్ర యూనిట్ ఆమెకు స్వాగతం పలుకుతూ అధికారిక ప్రకటన కూడా చేసేసింది.
బెంగళూరు బ్యూటీ రష్మిక మండన్న (Rashmika Mandanna) అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందంటే.. దానిక్కారణం, ఆమె టైమింగ్. రైట్ టైమ్‌లో మంచి మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటుండడమే.
అదే సమయంలో, రష్మిక మండన్న ప్లానింగ్ కూడా సూపర్బ్ అంతే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో అవకాశాల్ని రష్మిక భలేగా బ్యాలెన్స్ చేసుకుంటోంది.
Also Read: Shruti Haasan పెళ్ళయిపోయిందట కానీ.!
అన్నట్టు.. అభిమానులంటే రష్మికకి ప్రాణం. ఆ అభిమానుల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారో రష్మిక అస్సలూరుకోదు. అందుకే, మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి వున్నారు మరి.