రష్మిక మండన్నని చాలామంది గోల్డెన్ బ్యూటీ (Rashmika Mandanna Lucky Beauty) అంటున్నారు. తొలి సినిమా ‘చలో’ నుంచి, ‘భీష్మ’ సినిమా వరకూ సినిమా సినిమాకీ తన రేంజ్‌ని పెంచుకుంటూనే వుందీ కన్నడ కస్తూరి. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మండన్న నటిస్తోన్న విషయం విదితమే.
తెలుగులోనే కాదు, అటు మాతృ భాష కన్నడలోనూ, ఇంకోపక్క తమిళంలోనూ రష్మిక చాలా బిజీగానే వుంది. బాలీవుడ్ నుంచీ రష్మికకి పిలుపులొస్తున్నాయ్. అయితే, ప్రస్తుతానికి సౌత్ సినిమాలపై.. అందునా, తెలుగు సినిమాలపైనే తన దృష్టి వుందని చెబుతోంది రష్మిక.
ఇదిలా వుంటే, రష్మిక మరో మెగా ఛాన్స్ కొట్టేసిందంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే ‘ఆచార్య’ సినిమా. ఇందులో రావ్‌ు చరణ్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న విషయం విదితమే. ఆ పాత్రకు జోడీగా రష్మిక నటించబోతోందట. మెగాస్టార్ చిరంజీవి అంటే రష్మికకి చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది.
‘మీరు నాకు చాలా లక్కీ.. మీ ఆశీస్సులు నాకెప్పుడూ వుండాలి..’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరుగుతున్న సమయంలో రష్మిక, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవిని ఆకాశానికెత్తేసిన విషయం విదితమే.
ఆ అభిమానంతోనే, ‘ఆచార్య’ సినిమాలో చిన్న పాత్రే అయినా ఓకే చెప్పేసిందన్నది తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్ సారాంశం. అయితే, ‘ఆచార్య’ సినిమాలో చరణ్ నటించడంపై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే వుంది. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి ‘పెద్ద బ్రేక్’ వచ్చింది.
ఈ నేపథ్యంలో కథలో మార్పులు జరిగాయంటూ బోల్డన్ని పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. చరణ్ మాత్రం, ఈ సినిమాలో నటించాలనే అనుకుంటున్నాడు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ఎఫెక్ట్, ‘ఆచార్య’పై పడుతుందన్న కోణంలో చరణ్ కాస్త సంశయంలో వున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, రష్మిక చేతిలో మరో బిగ్ ప్రాజెక్ట్ వున్నట్లే కన్పిస్తోంది. అదే ఎన్టీఆర్ – త్రివిక్రవ్‌ు కాంబినేషన్‌లో సినిమా. ఇది కాక, మహేష్‌తో రష్మిక ఇంకో సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదట. నితిన్ కూడా మరోమారు రష్మికతో జతకట్టాలనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది.
‘లక్కు’ (Rashmika Mandanna Lucky Beauty) మరీ ఈ రేంజ్‌లో వుంటే, రష్మికని నెంబర్ వన్ ఛెయిర్ ఈజీగానే వరించేయకుండా వుంటుందా.?