Rashmika Mandanna Mission Majnu నేషనల్ క్రష్ రష్మిక మండన్నకి ఏమైంది.? బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్‌లో ఆమెకు ఫ్లాపులెందుకు పలకరిస్తున్నాయ్.?
మొన్నామధ్యన ‘గుడ్ బై’ అనే సినిమా చేసింది రష్మిక. బిగ్-బి అమితాబ్ బచ్చన్ ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఓటీటీ వేదికగా విడుదలైంది ఆ ‘గుడ్ బై’.
ఇక, ఇప్పుడు ఇంకోసారి కూడా డైరెక్ట్ ఓటీటీ తప్పలేదు రష్మికకి. రెండో బాలీవుడ్ సినిమా ‘మిషన్ మజ్ఞు’ కూడా ఓటీటీ వేదికగానే వచ్చింది.
Rashmika Mandanna Mission Majnu.. రష్మికకి అంత సీన్ లేదు..
ప్చ్.. రష్మికకి అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర లభించిందట. అన్ని రివ్యూల్లోనూ రష్మిక పాత్ర పేలవంగా వుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రష్మిక మాత్రం ఈ సినిమా ప్రమోషన్ల కోసం గట్టిగానే కష్టపడింది. ఓ వైపు ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా ప్రమోషన్లలో బిజీగా వుంటూనే, ఇంకో వైపు ‘మిషన్ మజ్ను’ కోసం కష్టపడింది.
పరమ రొటీన్ సినిమా అనీ, ఫ్లాట్ నెరేషన్ అనీ.. ‘మిషన్ మజ్ను’ గురించి రివ్యూల్లో పేర్కొంటున్నారు.
రష్మిక ఖేల్ ఖతం.?
బాలీవుడ్‌లో రష్మిక ఖేల్ ఖతం అయిపోయిందంటూ ‘మిషన్ మజ్ను’ రిలీజయ్యాక చర్చ జరుగుతోంది. కానీ, రష్మిక చేతిలో ‘పుష్ప ది రూల్’ వుందిప్పుడు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి అంటే భయమా.? గౌరవమా.?
పాన్ ఇండియా రికార్డుల దుమ్మ రేపడానికి రాబోతోంది ‘పుష్ప ది రూల్’. దాంతోపాటుగా, కొన్ని డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలూ రష్మిక చేతిలో వున్నాయ్.
కాగా, ‘మిషన్ మజ్ను’ తన మనసుకు నచ్చిన సినిమా అంటోంది రష్మిక.