Rashmika Mandanna Rakshit Shetty.. రష్మిక మండన్న కెరీర్ తొలి నాళ్ళలోనే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందామెకి.!
కానీ, అంతలోనే ఆ ఎంగేజ్మెంట్ రద్దయ్యింది.. ఆమె ప్రేమ పెళ్ళి పీటలెక్కలేదు. నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమాయణం, వైవాహిక బంధం వరకు వెళ్ళలేకపోయింది.
గతం గతః అని గతంలోనే రక్షిత్ శెట్టి ఫిక్సయిపోయాడు. రష్మిక సంగతి సరే సరి. కానీ, రక్షిత్ అభిమానులు మాత్రం, రష్మికని ట్రోల్ చేస్తూనే వున్నారు.
Rashmika Mandanna Rakshit Shetty.. ఈ ట్రోలింగ్ ఆగేదెలా.?
మధ్యలో రిషబ్ శెట్టి అభిమానులూ, రష్మికని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రక్షిత్, రష్మిక, రిషబ్.. ముగ్గురూ స్నేహితులు. ముగ్గురూ సినీ పరిశ్రమకి చెందినవారే.
రిషబ్ – రష్మికల మధ్య ఏం జరిగిందో తనకు తెలియదనీ, తాను మాత్రం రష్మికతో టచ్‌లోనే వున్నానని రక్షిత్ శెట్టి తాజాగా వెల్లడించాడు.

కెరీర్‌లో రష్మిక ఎన్నో మంచి మంచి విజయాల్ని అందుకుంటోందనీ, ఆమె జీవితం ఆమె ఇష్టమనీ రక్షిత్ శెట్టి అభిప్రాయపడ్డాడు.
ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందా.? అంటే, రక్షిత్ శెట్టి అభిమానులు మాత్రం, ‘వదిలేదే లేదు’ అంటున్నారు.
Also Read: కృతి సనన్.! బోల్డ్ అండ్ వైల్డ్ యాక్షన్.!
మరోపక్క, రిషబ్ అభిమానులు మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు రష్మిక మీద ట్రోలింగ్‌ని.
కాలం అన్ని గాయాల్నీ మానేలా చేస్తుందని అంటారు. కానీ, రష్మిక విషయంలో అలా జరగడంలేదు. ఈ వివాదాల కారణంగానే రష్మిక, కన్నడ సినీ పరిశ్రమకు కాస్త దూరంగా వుంటోంది.