Rashmika Vs Sapthami Gowda.. కన్నడ సినీ పరిశ్రమలో ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగానూ ఈ సినిమాలు సంచలన విజయాల్ని అందుకున్నాయ్.
‘కాంతారా’ అయితే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, చాలా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సప్తమి గౌడకి ఆఫర్లు పోటెత్తుతున్నాయ్.
తాజాగా ‘వాక్సిన్ వార్’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తోంది సప్తమి గౌడ.! ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఫేం దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతోందీ సినిమా.
Rashmika Vs Sapthami Gowda రష్మికతో పోటీ ఏంటి.?
సప్తమి గౌడ కంటే ముందే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి రష్మిక మండన్న. అయితే, రష్మిక కన్నడ సినిమాల్ని ఎప్పుడో వదిలేసింది.
అందుకే, ‘కాంతారా’ బ్యూటీ సప్తమి గౌడని చూసి నేర్చుకో.. అంటూ రష్మిక మండన్నపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు కన్నడ సినీ అభిమానులు.

‘నాకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినాసరే, మొదటి ప్రాధాన్యత కన్నడ సినిమాకే..’ అని సప్తమి గౌడ చెప్పడంతో, రష్మికపై ట్రోలింగ్ మరింత తీవ్రంగా జరుగుతోంది.
ట్రోలింగ్ తట్టుకోలేక దిగొచ్చిన రష్మిక..
తన మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండడంతో రష్మిక దిగి రాక తప్పలేదు. ‘కన్నడ సినిమాల్లోనూ నటిస్తాను..’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అంతే కాదు, తాను ఇప్పుడు ఈ స్థాయిలో వున్నానంటే కారణం కన్నడ సినీ పరిశ్రమేననీ, రక్షిత్ శెట్టి (Rakshit Shetty) అలాగే రిషబ్ శెట్టి (Rishabh Shetty) ఒకప్పుడు తనను ఎంతో ప్రోత్సహించారనీ, తనకు అండగా నిలబడ్డారనీ రష్మిక చెప్పుకొచ్చింది.
Also Read: Tamannaah Bhatia డ్రెస్సు మీద ట్రోలింగ్.! వై దిస్ కొలవెరి.!
వున్నపళంగా రష్మిక మళ్ళీ పాత ప్రేమని కన్నడ సినీ పరిశ్రమపై చూపిస్తుండడాన్ని ఎవరూ నమ్మడంలేదు.
ఏం చేసి రష్మిక మళ్ళీ కన్నడ సినీ అభిమానుల మనసుల్ని గెలుచుకుంటుందో ఏమో.!