Ravanasura First Report.. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ సినిమా ఎలా వుంది.? ఓవర్సీస్ ఆడియన్స్ ఏమంటున్నారు.? ఫస్ట్ రిపోర్ట్ సంగతేంటి.?
టైటిల్ ‘రావణాసుర’ (Ravanasura) చూస్తే నెగెటివ్ ఇంపాక్ట్ కనిపిస్తోంది.! అది కూడా ఓ సక్సెస్ సెంటిమెంట్ అయి కూర్చుంది ఇటీవలి కాలంలో.!
ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోయిన్లున్నారు.! అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ.. ఆ అందాల భామలు.!
Ravanasura First Report.. అప్పుడే వంద కోట్ల హంగామా.?
సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. అభిమానులైతే ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్.. అంటూ ఫ్లెక్సీలు పెట్టేశారు.
‘ధమాకా’ రవితేజ కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా.! ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో (మెగా మల్టీస్టారర్ అయినాగానీ) మరో వంద కోట్ల సినిమా రవితేజ ఖాతాలో పడింది.
నిజానికి, ‘వాల్తేరు వీరయ్య’ గ్రాస్ సుమారు 200 కోట్ల పైనే కావడం గమనార్హం. మరిప్పుడు, ‘రావణాసుర’తో రవితేజ ఏం చేయబోతున్నాడు.?
Also Read: Ustaad Bhagat Singh.. ఊచకోత షురూ.!
ఓవర్సీస్ నుంచి ‘రావణాసుర’పై వచ్చే రిపోర్ట్ కోసం ఇక్కడ, మన తెలుగు నాట నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు రవితేజ అభిమానులు.
కాస్సేపట్లో.. మరికొద్దిసేపట్లోనే ‘రావణాసుర’ ఫస్ట్ రిపోర్ట్ ఓవర్సీస్ నుంచి వచ్చేయనుంది. ప్రీ రిలీజ్ బజ్ మాత్రం, రవితేజ మాస్ ఎనర్జీకి తగ్గట్లే కనిపిస్తోందనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, రవితేజ వంద కోట్లు ఇంకోసారి కొల్లగొట్టేస్తాడా.? సినిమాలో కంటెంట్ ఏంటి.? నటీనటులెలా చేశారు.? దర్శకుడి టేకింగ్ సంగతేంటి.? నిర్మాణపు విలువలెలా వున్నాయ్..?
ఫుల్ రిపోర్ట్.. అలాగే రివ్యూ కోసం.. ఇదే స్పేస్‌లో చూడండి..