యాంకర్ రవి ఓవరాక్షన్ దెబ్బకి బలైపోయింది సీనియర్ నటి ప్రియ (Anchor Ravi Blame Game Strategy). ఇదీ బిగ్ బాస్ రియాల్టీ షో తాజా ఎపిసోడ్ చూశాక అందరికీ వచ్చేసిన ఓ క్లారిటీ. అంతకు ముందు ఎపిసోడ్ వేరేలా కనిపించింది. తప్పంతా ప్రియదే అయ్యిందక్కడ. లహరి విషయంలో ప్రియ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదనిపించింది అందరికీ.
అసలు ప్రియలో అలా విష బీజం నాటిందే యాంకర్ రవి అని నేటి ఎపిసోడ్ తర్వాత అందరికీ అర్థమయిపోయింది. అయితే, ఇక్కడ లహరి తనకు దూరమవడాన్ని ప్రియ, రవి వద్ద చెప్పుకుని వాపోవడంతో, రవి ఛాన్స్ తీసుకున్నాడు.. గేమ్ ఆడేశాడు.. ప్రియని బలిపశువుని చేసేశాడు.
ఓ పెళ్ళి కాని అమ్మాయిని.. పెళ్ళయిన వ్యక్తితో ‘ముడి’ పెట్టేసినట్టుగా కనిపించింది ప్రియ తీరు.. ముందు రోజు ఎపిసోడ్‌లో. కానీ, అలా ‘షో’ చేసింది స్వయానా రవి కావడం గమనార్హం. లహరి, హౌస్‌లో వున్న సింగిల్ మెన్ (ఒంటరి పురుషులు) అందర్నీ వదిలేసి తన వెంట పడుతోందని రవి, ప్రియకి చెప్పాడు.
Also Read: బిగ్ హౌస్‌లో భంచిక్.! తెర యెనుక నాసామి.!
మొత్తంగా రవి ఏం మాట్లాడాడన్నది ప్రియ సవివరంగా చెప్పింది. అయినా, రవి బుకాయించేశాడు. ప్రియ మాత్రం, తన మాటలు వేరే అర్థాన్నిచ్చేలా వుండటం పట్ల విచారం వ్యక్తం చేసింది, క్షమాపణ కూడా చెప్పింది. ఇటు లహరి అటు రవి కుటుంబాలకీ క్షమాపణ చెప్పింది ప్రియ.
వామ్మో.. బిగ్ బాస్ వేదికగా ఇంత ‘ప్లిప్పర్’ నాటకాలు ఆడతారా.? ఎవరికి వారే.. ఇందులో ఎవరూ తక్కువ కాదు.. అన్నట్టుంది పరిస్థితి. అందునా రవి గేమ్ స్ట్రాటజీ అయితే, న భూతో న భవిష్యతి.. అనాలేమో. కానీ, ఇక్కడ రవి తన క్యారెక్టర్ లాస్ అయ్యాడు.. ఔను, వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. ఇద్దరు స్త్రీల మధ్య తగాదా పెట్టాడు మరి.
ఇంతేనా.? ఇంకా ఏమైనా సీక్రెట్స్ బిగ్ హౌస్ సాక్షిగా వున్నాయా.? అసలు రవి ( Anchor Ravi Blame Game Strategy ) తప్పు చేశాడన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోన్న తాజా అంశం వెనుక అసలు కథేంటి.? ఏమో, అది బిగ్ బాస్‌కే తెలియాలి.
ఇదిలా వుంటే, ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యుల వివరాలిలా వున్నాయ్. ప్రియ, ప్రియాంక సింగ్, లహరి, మానస్, శ్రీరామచంద్ర ఆ లిస్టులో వున్నారు. వీరిలో ప్రియ ఎలిమినేషన్ ఖాయమనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.