Raviteja Dimple Hayathi BMW.. ‘మాస్ జాతర’ వచ్చి వెళ్ళిపోయింది.! అంతకు ముందు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’.. ఒకదానికి మించిన డిజాస్టర్ ఇంకోటి.!
మళ్ళీ ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటున్నాడు రవితేజ. ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు.!
సెన్సిబుల్ కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతకు మించి కష్టపడతాడు రవితేజ. కానీ, ఎందుకు ఫ్లాపుల మీద ఫ్లాపులొస్తున్నాయ్.?
నా సినిమాలకి టైటిల్స్ నేనే పెట్టేసుకుంటాను.. అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రవితేజ. సినిమా హిట్టవుతుందో, ఫ్లాపవుతుందో ముందే తెలిసిపోతుంది.. అని కూడా రవితేజ చెప్పుకున్నాడు.
రవితేజ అంటే, కేవలం నటుడు మాత్రమే కాదు. దర్శకత్వంపై సంపూర్ణ అవగాహన కూడా వుందతనికి. అయినా, ఫ్లాపులు.. కాదు కాదు, డిజాస్టర్లు ఎందుకు వస్తున్నట్లు.?
ఎక్కడో తేడా కొడుతోంది. మాస్ అనే మూస నుంచి బయటకు రావడం లేదు రవితేజ. మాస్ సినిమాలన్నీ మూస సినిమాలు కావు. కానీ, రవితేజ చేసే మాస్ సినిమాలన్నీ మూస సినిమాలే.!
అదే అసలు సమస్య.! కిషోర్ తిరుమల నుంచి ఒకింత క్లాస్ కంటెంట్‌ని ఆశించొచ్చు. టైటిల్ కూడా ఒకింత క్లాస్‌గానే వుంది. సో, సినిమాపై రవితేజ అభిమానులు ఈసారి గట్టిగానే ఆశలు పెట్టుకోవచ్చు.
Raviteja Dimple Hayathi BMW.. రవితేజ, డింపుల్ హయాతి.. రెండోస్సారి..
అన్నట్టు రవితేజ, డింపుల్ హయాతీ గతంలో ‘ఖిలాడీ’ అనే సినిమా చేశారు. రిజల్ట్ తెలిసిందే కదా.! ఏమో, ఈసారి ఏమవుతుందో.!
రవితేజ అభిమానులు మాత్రం, తమ అభిమాన హీరో మాస్ అనే మూస నుంచి బయటకు రావాలని, సక్సెస్ కొట్టాలనీ కోరుకుంటున్నారు.!
అన్నట్టు రవితేజ – డింపుల్ హయాతి మధ్య చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలకు సిద్ధమైంది. దానికి సంబంధించిన స్టిల్‌నే మీరు చూస్తున్నది.
ఫ్లాపుల సంగతెలా వున్నా, ప్రీ రిలీజ్ హైప్ మాత్రం రవితేజ సినిమాలకి అనూహ్యంగా క్రియేట్ అవుతూనే వుంది.
