Home » రీల్స్ పిచ్చి తప్ప.. దేవుడంటే భయం, భక్తి.. రెండూ లేవ్.!

రీల్స్ పిచ్చి తప్ప.. దేవుడంటే భయం, భక్తి.. రెండూ లేవ్.!

by hellomudra
0 comments
Tirumala

Reels Influencers Against Tirumala.. కొన్నాళ్ళ క్రితం ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి స్నేహితురాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై వున్న తిరుమలలో, రీల్స్ చేశారు.

అప్పట్లో, ఆ వ్యవహారం వివాదాస్పదమయ్యింది. భార్యని వదిలేసి, స్నేహితురాలితో వుంటోన్న ఆ ప్రజా ప్రతినిథి వ్యవహార శైలి పెను దుమారానికి కారణమయ్యింది.

చట్ట పరంగా, ఆ ప్రజా ప్రతినిథిపై ఇంతవరకు చర్యలు లేవనుకోండి.. అది వేరే సంగతి.

మొన్నీమధ్యనే ఓ యాంకర్, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వెకిలిగా రీల్స్ చేసింది. విషయం వైరల్ అవడం, వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పిందామె.

తాజాగా, మరో ఇన్‌ఫ్లూయెన్సర్ తిరుమలలో రీల్స్ చేసి, వార్తల్లోకెక్కింది. ‘ఛీ.. థూ..’ అని, జనం ఆమెపై విరుచుకుపడ్డంతో, సింపతీ డ్రామాల్ని తెరపైకి తెచ్చింది.

Reels Influencers Against Tirumala.. పిచ్చి బాగా ముదిరిపోయింది..

‘మాకు వెంకటేశ్వర స్వామి అంటే, బోల్డంత భక్తి.. మేం, వెంకటేశ్వర స్వామి గొప్పతనం వివరిస్తూ ఎన్నో వీడియోలు చేశాం.. తెల్సా.?’ అంటూ, తప్పుడు రీల్స్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు డ్యామేజ్ కంట్రోల్ మాటలు చెబుతుంటారు.

ఇదో ప్రసహనంగా మారిపోయింది. దేవుడంటే కనీసపాటి భయం, భక్తీ.. రెండూ లేకుండా పోతున్నాయి ఈ రోజుల్లో. నిజానికి, చాలా దేవాలయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలే లక్ష్యంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ వెకిలితనానికి పాల్పడుతున్నారంటే, ఇందులో ‘అన్యమతస్తుల కుట్ర’ కూడా దాగి వుండొచ్చు.

‘మేమూ హిందువులమే.. మేమూ భక్తులమే..’ అని పైకి చెబుతున్నారుగానీ, తెరవెనుకాల కథ వేరే వుంటోంది.

ఇక, తిరుమల కొండపై ఈ తరహా రీల్స్ వెకిలితనాలకు ఆస్కారం లేకుండా చెయ్యాలంటే, అది అలిపిరి టోల్‌గేట్ దగ్గర సంస్కరణలతోనే మొదలవ్వాలి.

శ్రీవారి మెట్టు మార్గం దగ్గర కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమో, ముందు ముందు మొబైల్ ఫోన్స్, వీడియో కెమెరాల్లాంటివి కొండపైకి అనుమతివ్వకుండా చర్యలు తీసుకోవాల్సి రావొచ్చేమో.

రీల్స్.. రీల్స్.. రీల్స్.. ఇదో రోగం.!

మొదటి ఘటనలోని రాజకీయ ప్రబుద్ధుడి పేరు దువ్వాడ శ్రీనివాస్, అతని స్నేహితురాలు మాధురి కాగా, రెండో ఘటనలో యాంకర్ పేరు శివజ్యోతి.

తాజా ఘటనలో ఇన్‌ఫ్లూయెన్సర్ పేరు గీతూ రాయల్.! శివజ్యోతి, గీతూ రాయల్, మాధురి.. ముగ్గురూ బిగ్ బాస్ కంటెస్టెంట్లే.

దేవ దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రీల్స్ ముసుగులో అపహాస్యం చేస్తే.. ఖచ్చితంగా శిక్ష పడుతుంది.. కాకపోతే, ఇది కలియుగం.. ఆ శిక్ష ఏ రూపంలో వుంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group