Reena Dwivedi: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, ఆ మంటల్లో భలేగా చలి కాచుకోవచ్చని అనుకున్నాడట ఇంకొకడు.
ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ఎన్నికల వ్యవస్థ భ్రష్ఠుపట్టిపోయిందనీ ఓ పక్క ఆవేదన వ్యక్తమవుతోంటే, ఇంకో పక్క ఎన్నికల అధికారిణి సెక్సీగా వుందంటూ, ఆ అధికారిణి అందాలను అభివర్ణించడంలో మీడియా మునిగి తేలుతోంది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రీనా ద్వివేది అనే అధికారిణి పేరు మార్మోగిపోతోంది. గతంలోనూ ఈమె వస్త్రధారణపై పిచ్చపిచ్చగా పచ్చి పచ్చిగా వర్ణించేయడానికి మీడియా పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.
Reena Dwivedi.. ఎవరీ రీనా ద్వివేదీ.. ఏమా అందమైన కథ.?
రీనా ద్వివేది మేని ఛాయ ఒంపు సొంపులు మీడియాని అంతలా ఆకర్షించాయ్. దురదృష్టమేంటంటే, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింస, ప్రలోభాల పర్వం, రాజకీయ నాయకుల నిస్సిగ్తుతనం.. ఇవేమీ మీడియాకి అంతగా పట్టలేదు.
తన చుట్టూ జరుగుతున్న రాద్ధాంతంపై రీనా ద్వివేది ఓ సందర్భంలో స్పందిస్తూ, తానూ సగటు మహిళనే అని తనకేమీ అదనపు ప్రత్యేకతలు లేవనీ, ఎందుకు తనపై మీడియాకి ఇంత ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతోందో అర్ధం కావడం లేదనీ చెప్పింది.
మీడియా అత్యుత్సాహం అంతా ఇంతా కాదు సుమీ.!
నిజమే, రీనా ద్వివేది ఏమీ రాజకీయ నాయకురాలు కాదు, సినీ తార అంతకన్నా కాదు. ఆమె ఓ మామూలు స్త్రీ. ఓ ప్రభుత్వ ఉద్యోగి. మిగతా వారి కంటే, ఆమె వస్త్రధారణ ఏమీ లేదు. దేశంలో బోలెడంత మంది మహిళలు ఎన్నికల విధుల్ని నిర్వహిస్తున్నారు.
Also Read: ముసుగు వేయాలా.? వద్దా.? ఏ ప్రయోజనం కోసం ఈ రగడ.!
కానీ, మిగతా మహిళా అధికారులెవరిలోనూ కనిపించని ఆ ప్రత్యేక ఆకర్షణ సో కాల్డ్ మీడియా మేధావులకి రీనా ద్వివేది లోనే (Reena Dwivedi) కనిపిస్తోందంటే, ‘వాళ్ల వంకర బుద్ది’ అలాంటిది.!