Regina Cassandra OTT Divorce.. పలు తెలుగు సినిమాలతో నటిగా మంచి విజయాలే అందుకున్న రెజినా కస్సాండ్రా.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలోనూ బిజీ అయ్యింది.
బ్యాక్ టు బ్యాక్ ఆమె నుంచి రెండు వెబ్ సిరీస్‌లు ఓటీటీ వీక్షకుల ముందుకొచ్చాయ్. ఒకటేమో కంప్లీట్ యాక్షన్.. అందులో ఆమెదే మెయిన్ లీడ్.
రెండోదాంట్లో రెజినాకి పెద్దగా సీన్ లేదు.! జస్ట్ ఆమె అలా కనిపిస్తుందంతే. కాకపోతే, రెండిటికీ ఓ ఇంట్రెస్టింగ్ పోలిక వుంటుంది. అదే విడాకుల వ్యవహారం.
ఒకదాంట్లోనేమో పోలీస్ ఆఫీసర్ అయిన భర్త నుంచి విడాకులు తీసుకున్న భార్యగా నటించింది. ఇంకోదాంట్లోనేమో బిడ్డ కోసం భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఎదురు చూసే భార్యగా నటించింది.
ఇక్కడా ఇంకో పోలిక వుందండోయ్. ఒక సిరీస్‌లో రెజీనా పోలీస్ ఆఫీసర్ అయితే, ఇంకో సిరీస్‌లో ఆమె భర్త పోలీస్ అధికారి. వావ్.! వాట్ ఏ కో ఇన్సిడెన్స్ కదా.! అలా సెట్టయ్యిందంతే రెజీనాకి.
Regina Cassandra OTT ఛాలెంజింగ్ రోల్..
ఈ రెండు సిరీస్‌లూ తిలకించిన ఓటీటీ జనం ఈ కామన్ పాయింట్‌ని కంపేర్ చేసుకుంటూ రెజీనా పాత్రల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

అయితే, ‘జాన్‌బాజ్ హిందూస్తాన్ కే’ వెబ్ సిరీస్‌లో రెజీనా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయ్. ఈ పాత్ర కోసం రెజీనా ట్రాన్స్‌ఫామేషన్‌కి ఓటీటీ జనం ఫిదా అవుతున్నారు.
ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. అవును నిజమే, పోలీస్ వున్నతాధికారి కావ్య అయ్యర్ వంటి బాధ్యత గల పాత్రకు రెజీనా తనదైన హుందాతనంతో ఆకట్టుకుంది రెజీనా కసండ్రా. యాక్షన్ సీన్లలోనూ చాలా కాన్ఫిడెంట్‌గా నటించింది.
Also Read: Raashi Khanna: విజయ్ దేవరకొండతో ఇంకోస్సారి.!
రెండో సిరీస్‌లో రెజీనా పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా, ఈ సిరీస్ కూడా ఓటీటీలో బాగానే పాపులర్ అయ్యింది. సమంత వంటి స్టార్ సెలబ్రిటీలను సైతం ఈ వెబ్ సిరీస్ మెప్పించింది.
బాలీవుడ్ యంగ్ హీరో షాఫిద్ కపూర్ ఈ సిరీస్‌తోనే ఓటీటీ ఆరంగేట్రం చేశారు. విజయ్ సేతుపతి రెజీనాకి విడాకులిచ్చేసిన పోలీస్ భర్త పాత్రలో కనిపించాడు.