Rhea Chakraborty Sushant.. బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు అస్సలేమాత్రం ‘వదిలేది లే’ అంటున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో ఏ నటుడు లేదా నటి విషయంలోనూ ఇంతకు ముందెన్నడూ ఇలా జరిగింది లేదు.
దివ్యభారతి, సిల్క్ స్మిత.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా అనుమానాస్పద మరణాలున్నాయి భారతీయ సినీ పరిశ్రమలో. టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ కూడా బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
Rhea Chakraborty Sushant.. సుశాంత్‌ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు.?
నిజమే.! సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి (Sushant Singh Rajput) బోల్డంతమంది అభిమానులున్నారు. బహుశా ఏ హీరోకీ ఇలాంటి అభిమానులు వుండరేమో.
సుశాంత్ చనిపోయి రోజులు, నెలలు.. ఏళ్ళు గడుస్తున్నాయ్.! కానీ, ఎప్పటికప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

పనిలో పనిగా, రియా చక్రవర్తి (Rhea Chakraborty) పేరునీ ట్రెండింగ్‌లోకి తెస్తున్నారు సుశాంత్ అభిమానులు.. అయితే, నెగెటివ్ యాంగిల్‌లో.
ఆమె ఏం తప్పు చేసిందని.?
సుశాంత్ బలవన్మరణానికి రియా చక్రవర్తినే కారణమన్నది ఓ ఆరోపణ. అందుకే, రియా చక్రవర్తిని ‘వదిలేది లే’ అంటున్నారు.
కాగా, సుశాంత్‌ని గుర్తు చేసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో సుశాంత్‌తో తాను కలిసున్న ‘పాత’ ఫొటోల్ని షేర్ చేస్తుంటుంది రియా చక్రవర్తి.
Also Read: ఓ ఉదయ్ కిరణ్.. ఓ సుధీర్ వర్మ.! కానీ, ఎందుకిలా.?
‘చచ్చిపోయాడు కదా.. ఇకనైనా వదిలెయ్.. నువ్వు తలచుకుంటే, అతని ఆత్మ ఘోషిస్తుంది..’ అంటూ సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు.
అయినా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేస్తే న్యాయం జరిగిపోతుందా.? సుశాంత్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడన్నది ఇప్పటికీ తేలని మిస్టరీ ఎందుకయ్యింది.?
తెరవెనుక బలమైన శక్తుల ప్రమేయం లేకపోతే, ఈపాటికి సుశాంత్ మరణానికి సంబంధించిన మిస్టరీ వీడి వుండేదే. ఈ కేసులో అనూహ్యంగా డ్రగ్స్ లింకు కూడా తెరపైకొచ్చింది. అది మళ్ళీ కొత్త రచ్చకు తెరలేపింది.
అరెస్టులూ జరిగాయ్. మళ్ళీ కేసు చప్పబడిపోయింది. ఇదింతే.! ఈ విచారణల తీరు మారదంతే.!
జస్టిస్ ఫర్ సుశాంత్.. అంటూ అభిమానులు ఎంతలా వాపోతున్నా, ఈ కేసులో నిజాలు నిగ్గు తేలడంలేదు. సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా డెత్ మిస్టరీస్‌లో సుశాంత్ బలవన్మరణం కూడా ఒకటి.