Rishab Shetty Kantara Prequel.. కన్నడ సినిమా ‘కాంతార’, దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ‘కేజీఎఫ్’ లాంటి హైప్ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి హంగామా లేదు.! కానీ, ‘కాంతార’ సంచలనాలకు కేంద్ర బిందువైంది.
ఇప్పుడు ఆ ‘కాంతార’కి సీక్వెల్ రాబోతోంది. కాదు కాదు, ఇది ప్రీక్వెల్ అట. ‘మీరు చూసింది రెండో పార్ట్.. చూడాల్సింది ఫస్ట్ పార్ట్..’ అంటూ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘కాంతార’ 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రీక్వెల్ గురించిన ప్రకటన చేశాడు రిషబ్ శెట్టి.
Rishab Shetty Kantara Prequel.. మొదటి పార్ట్ ఎప్పుడొస్తుందో.?
రిషబ్ చెబుతున్నట్లు ‘కాంతార’ రెండో పార్ట్ అయితే.. మొదటి పార్ట్ ఎప్పుడు వస్తుందట.? అదెలా వుండబోతోందిట.?
‘రెండో పార్ట్ కంటే మొదటి పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా వుండబోతోంది. ఆ వివరాలు ముందు ముందు వెల్లడిస్తాను..’ అని చెప్పాడు రిషబ్ శెట్టి.
ఇది కదా ట్విస్ట్ అంటే.! నిజానికి, ప్రీక్వెల్ ఆలోచనలు కొత్తేమీ కాదుగానీ, ‘మీరు చూసింది రెండో భాగం.. మొదటి భాగం త్వరలో..’ అనే ప్రకటన మాత్రం కొత్తదే.
Also Read: అల్లు అరవింద్ వర్సెస్ దిల్ రాజు.! ‘బకరా’ పరశురామ్.!
రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించిన ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘కాంతార’ మేనియాలో దేశమంతా ఊగిపోయింది.
2022లో వచ్చిన సినిమాల్లో లాభాల పరంగా చూస్తే, ‘కాంతార’ ది బెస్ట్ అంటారు. అంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ఎక్కువ లాభాలు ఆర్జించింది ‘కాంతార’ సినిమా.