బ్రేకప్.. అంటే విడిపోవడం. మామూలుగా అయితే, లవర్స్ విడిపోయినప్పుడు బ్రేకప్ అనే మాట ప్రస్థావిస్తాం. బ్రేకప్ పార్టీలు కూడా జరుగుతున్నాయిప్పుడు. ఇదొక నయా ట్రెండ్. కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది వెరైటీ బ్రేకప్ (Kajal Break Up). ఇంతకు ముందెప్పుడూ ఇలాంటిది విని ఉండమేమో.
విషయం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్లు ఆర్జే కాజల్, శ్రీరామ్ చంద్ర మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించింది. ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ ప్రక్రియ వచ్చిందంటే చాలు.. పరమ చెత్త రీజన్స్ వెతుక్కుని మరీ రెచ్చిపోతుంటారు కంటెస్టెంట్లు. కాజల్, శ్రీరామ్ చంద్ర మాటా మాటా అనుకున్నారు. విడిపోయారు.
వీళ్లేమన్నా నిజ జీవితంలో బంధువులా.? స్నేహితులా.? ఓ రియాల్టీ షో కోసం వెళ్లి, అక్కడ జీవించేస్తున్నామన్న భ్రమలో తెగ నటించేస్తున్న కంటెస్టెంట్లు మాత్రమే. నటన తప్ప అక్కడ ఏముందనీ.? అక్కా తమ్ముడి బంధం అన్నట్లుగా దీనికో పెద్ద బిల్డప్. మనిద్దరి మధ్యా సిస్టర్, బ్రదర్ బంధం ఇక్కడితో తెగిపోయిందని కాజల్ సెలవిచ్చింది.
నవ్వుకుంటున్నారు బిగ్‌బాస్ వీక్షకులు ఇలాంటి సిల్లీ థింగ్స్ చూసి. విశ్వ అన్నయ్యా, ప్రియాంక చెల్లెమ్మా.. మొన్నామధ్య రెచ్చిపోయి చేసిన హాట్ డాన్స్ చూసినాకా, ఈ బంధాల గురించి కంటెస్టెంట్లు మాట్లాడుతుంటే, వెగటు పుట్టేస్తోంది.
వీళ్లేమైనా దేశోద్ధారకులా.? పలానా వాళ్లు గెలవాలని వీక్షకులు ఓట్లేసేది.? కాసేపు ఎంటర్టైన్మెంట్ అంతే. బయటికొచ్చాకా, ఈ బంధాల్లో ఎన్ని నిలబడతాయి.? ఎన్ని కామెడీ అయిపోతాయి.? ఇది మరీ టూ మచ్. సిస్టర్, బ్రదర్ బ్రేకప్ (Kajal Break Up) అంటూ సమాజానికి దిక్కుమాలిన సందేశం ఇవ్వడమేంటీ.?