Roads Dirty Politics రోడ్లపై రాజకీయాలేంటి నాన్సెన్స్.! బహుశా చాలామంది ఈ మాట అనుకుని వుండొచ్చు.
ఏదన్నా అత్యవసర పని మీద బయటకు వెళితే, అక్కడ రాజకీయ పార్టీల కార్యక్రమాలు చాలా చికాకు పెడతాయ్.!
ఆ మాటకొస్తే, రాజకీయ కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడని సామాన్యుడంటూ వుండడు. అసలు రాజకీయం చేసేదే ప్రజల కోసమంటారు రాజకీయ నాయకులు.
ఔనా.? నిజంగానే రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నది ప్రజల కోసమేనా.? మరి, ఆ ప్రజలెందుకు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం కళ్ళు కాయలే కాచేలా ఎదురుచూస్తాయ్.?
రాజకీయ నాయకుల ఇళ్ళ ముందర రోడ్లు అద్భుతంగా వుంటాయ్. సామాన్యుల ఇళ్ళ ముందు పరిస్థితుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వీళ్ళకి కూడు దొరకదు.. వాళ్ళేమో కోట్లకు పడగలెత్తుతారు..
సామాన్యుడేమో పూట గడవని స్థితిలో వుంటే, రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తుతారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలేదిక్కడ.
ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది గనుక.. రోడ్లపై రాజకీయ కార్యక్రమాలను బంద్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట.
నిజానికి, మంచి విషయమే ఇది. అయితే, అన్ని పార్టీలకూ (అధికార పార్టీ సహా) ఈ నిబంధన వర్తిస్తుందా.?
ముఖ్యమంత్రి సభలకు డబ్బులిచ్చి జనాన్ని తరలించకుండా వుంటారా.? రోడ్లను బంద్ చేయకుండా వుంటారా.?
నిబంధనలు పెడతారుగానీ, అధికారంలో వున్నోళ్ళు పాటించరు. ఎందుకంటే, అధికారంలో వుండటమంటే, రాచరిక వ్యస్థను నడుపుతున్నట్టే లెక్క.
Roads Dirty Politics రోడ్ షో ఎందుకు.?
రోడ్లపై రాజకీయ కార్యక్రమాలుండకూడదంటే.. అసలు ‘రోడ్ షో’ అన్నమాటకే అర్థం లేదు. పాదయాత్రల సంగతి సరే సరి.! ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కాదు.. ఒక్క దెబ్బకి.. సర్వం మటాష్ అన్నమాట.
ఇకపై తుప్పల్లోనే రాజకీయం చేయాలి.. ఆ తుప్పల్లోనే తొక్కుకుంటూ పోవాలి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.. రాజకీయం చేయాలంటే.
వెనకటికి ఒకడు ఈగ వాలిందని కాలు నరికేశాడట. అలా తయారైంది పరిస్థితి. తొక్కిసలాట జరిగిందంటే, ఆ కార్యక్రమానికి అనుమతిచ్చిన ప్రభుత్వ యంత్రాంగం తాలూకు వైఫల్యం.
Also Read: బీఆర్ఎస్: ఏపీలో కేసీయార్ రాజకీయం చెయ్యకూడదా.?
పోయిన ప్రాణాలకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధ్యత వహించాలి.!
నిజమే.. రాజకీయ పార్టీల ఆలోచనలూ మారాలి.! రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బల ప్రదర్శన చేయకూడదు. అలాంటి బల ప్రదర్శనల్ని ఎవరూ సమర్థించరు.
అలాగని, అధికారంలో వున్నాం కదా అని నిరంకుశ పాలన చేస్తామంటే అస్సలు కుదరదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు.!
తాను చేస్తే శృంగారం.. ఇంకెవరైనా చేస్తే అది వ్యభిచారం అన్నాడట వెనకటికి ఒకడు. అలా వుంది ప్రస్తుత పాలకుల పరిస్థితి.
– yeSBee